ఇన్ని రోజులు టమాటా ధరలతో ఇబ్బంది బడిన ప్రజలు ఇప్పుడు ఉపశనం పొందుతున్నారు. టమాటా ధర క్రమంగా తగ్గుతుండడంతో సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం కిలో టమాటా రూ.40 నుంచి రూ.50 పలుకుతోంది. ఈ ధరలు సెప్టెంబర్ రెండో వారానికి రూ. 20 నుంచి రూ.30 చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టమాటా దిగుబడి పెరిగినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఆగస్టు రెండో వారం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి టమాటాలు మార్కెట్‌లకు వస్తున్నాయి.
మన హైదరాబాద్ కు రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి టమాటా భారీగానే వస్తోంది. అంతకాకుండా భాగ్యనగరం చుట్టూ పక్కల జిల్లాలైన వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ నుంచి టమాటాలు రావడంతో ధరలు తగ్గుతోన్నట్లు వ్యాపారులు చెబుతున్రనా. ప్రస్తుతం హైదరాబాద్ రైతు బజార్ లో టమాటా ధర కిలో రూ. 35 గా ఉంది. మరికొన్ని జిల్లాల్లో రూ.35-50 పలుకుతోంది. అక్టోబరు మధ్య నాటికి హోల్‌సేల్ మార్కెట్‌లలో కిలో ధర రూ.5-10 తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

జులైలో టమాటా ధర కేజీ రూ. 250 వరకు పలికింది. ఆగస్ట్ మొదటి వారం నుంచి టమాటా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. టమాటా అధికంగా పండించే ఆంధ్రప్రదేశ్ సహా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హరియాణా రాష్ట్రాల నుంచి సరఫరా పెరగడంతో ధరలు క్రమంగా దిగొస్తున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది.మహారాష్ట్ర నాసిక్‌లోని పింపాల్‌గావ్ బస్వంత్ మార్కెట్‌కు వారం రోజులుగా టమాటా రాక ఆరు రెట్లు పెరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో మొన్నటివరకు కిలో రూ.220గా ఉన్న టమాటా ధర శుక్రవారం రూ.100 లకు తగ్గాయి. మిగతా కూరగాయల ధరలు కూడా సాధారణంగానే ఉన్నాయి. ఇక ఉల్లి ధరలు పెరుగుతాయని అందరు భయపడ్డారు. కానీ కేంద్రం బఫర్ స్టాక్ విడుదల చేయడంతో ధరలు అదువులోనే ఉన్నాయి. ఉల్లి కిలోధర రూ. 20 నుంచి రూ.30 పలుకుతోంది.


Click it and Unblock the Notifications