హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సామాజిక అంశాల పట్ల మంచి అవగాహన, చైతన్యం ఉంది. హృద్రోగాలతో బాధపడే చిన్నారుల కోసం ఆయన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌ను నెలకొల్పారు. ఈ ఫౌండేషన్ కింద చేపట్టే చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు, వాటికి అయ్యే ఖర్చు, ఇతర వైద్య అవసరాలు, దీని నిర్వహణకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని మహేష్ బాబు అందిస్తారు. ఈ ఆర్థిక సహాయంతో బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆ పిల్లలకు ఆపరేషన్లను నిర్వహిస్తుంది.

ఆడి ఇ-ట్రాన్ కొన్న సూపర్ స్టార్..
ఈ ఫౌండేషన్‌కు సంబంధించిన లోగోను మహేష్ బాబు కిందటి నెలలోనే ఆవిష్కరించారు. ఇప్పుడు తాజాగా పర్యావరణానికి హాని కలిగించని విధంగా ఎలక్ట్రిక్ వెహికల్ పట్ల మొగ్గు చూపారు. కొత్తగా ఆడి ఇ-ట్రాన్ కారును కొనుగోలు చేశారు. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు అది. విద్యుత్ ఆధారంగా నడుస్తుంది. దీని ధర.. కోటి 15 లక్షల రూపాయలు. ఈ కారును కొనుగోలు చేసినట్లు మహేష్ బాబు వెల్లడించారు. ఈ మేరకు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.
ఎకో ఫ్రెండ్లీ వెహికల్స్‌కు సపోర్ట్..
బ్రింగింగ్ ఎ క్లీన్, గ్రీన్ అండ్ సస్టెయినబుల్ ఫ్యూచర్ హోమ్.. ఎగ్జయిటెడ్ ఫర్ ఆడి ఎక్స్‌పీరియన్స్ అనే ట్యాగ్‌ను జత చేశారు. పర్యావరణానికి హాని కలిగించని రవాణా వ్యవస్థకు తాను సపోర్ట్ చేస్తున్నాననే విషయాన్ని సూపర్ స్టార్ చెప్పకనే చెప్పారు. ఆడి కార్లను కొనుగోలు చేసిన హీరోల జాబితాలో ఆయన చేరారు. ఎలక్ట్రిక్ ఆధారంగా నడిచే లగ్జరీ ఎస్‌యూవీ కారును మాత్రం ఆయనే తొలిసారిగా కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.

ప్లాటినం గ్రే ఫినిషింగ్..
ప్లాటినం గ్రే ఫినిషింగ్ కారు అది. 20-అంగుళాల గ్రాఫైట్ గ్రే డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌ను కలిగివుంది ఈ కారు. దీని పొడవు 5,014, ఎత్తు 1,686 మిల్లీమీటర్లు. వెడల్పు 1,976 ఎంఎం. ఈ కారు బూట్ స్పేస్ 660 లీటర్లు. 1,725 లీటర్ల వరకు ఎక్స్‌టెండ్ చేసుకునే వీలు ఉంది. 12 అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఆడి వర్చువల్ కాక్‌పిట్, 3డీ సౌండ్ సిస్టమ్ గల 16 స్పీకర్ల ఒలుఫ్సెన్ ఆడియో, ఫోర్ జోన్ క్లైమెట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, గ్లాస్ సన్‌రూఫ్ దీని సొంతం.

ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్..
భద్రత విషయానికి వస్తే- ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఇందులో ఉంటాయి. ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సర్లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 71 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఈ కారులో అమర్చి ఉంటుంది. 308 హార్స్ పవర్, 540 ఎన్ఎం టార్క్‌ను ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. 6.8 సెకెన్ల వ్యవధిలో 100 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకునే కెపాసిటీ ఈ కారుకు ఉంది. టాప్ స్పీడ్ 190 కిలోమీటర్లు.

వచ్చేనెల సర్కారువారి పాట
కాగా- మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారువారి పాట. వచ్చే నెల 12వ తేదీన విడుదల కానుంది. సంకాంత్రికే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. కీర్తిసురేష్ హీరోయిన్. పరశురామ్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంది. కాగా- ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications