Box Office Collection: సంక్రాంతి రేసులో ఐదు సినిమాలు! కలక్షన్ల రేసులో గెలిచింది ఎవరంటే..

టాలీవుడ్‌లో సంక్రాంతి పండగ అంటే కేవలం పిండి వంటలే కాదు థియేటర్ల వద్ద కలెక్షన్ల జాతర కూడా! అయితే ఈ 2026 సంక్రాంతి.. గతానికి భిన్నంగా ఐదు క్రేజీ సినిమాలతో రసవత్తరంగా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు, యంగ్ హీరోలు నవీన్ పోలిశెట్టి, శర్వానంద్, మాస్ రాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. మరి ఈ బిగ్ ఫైట్‌లో అసలైన బాక్సాఫీస్ కలెక్షన్ (box office collection) కింగ్ ఎవరు? ఏ సినిమా ఎంత వసూలు చేసింది? పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

tollywood sankranti 2026 box office collection winners list chiranjeevi mana shankar varaprasad garu vs prabhas raja saab

రాజా సాబ్ (Raja Saab): ప్రభాస్ మేనియా.. కలెక్షన్లు ఓకే కానీ!

ఈ పండగ సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా 'రాజా సాబ్'. హారర్-కామెడీ జోనర్‌లో ప్రభాస్ చేస్తున్న తొలి ప్రయత్నం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

  • పెట్టుబడి: ఈ సినిమాకు భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీగానే ఖర్చు చేశారు.
  • కలెక్షన్లు: డైరెక్టర్ మారుతి స్క్రీన్ ప్లేపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ప్రభాస్ క్రేజ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే రూ.225 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు సమాచారం.

అయితే టాక్ నెగటివ్‌గా ఉండటంతో లాంగ్ రన్‌లో ఈ సినిమా ఎంత నిలబడుతుందో చూడాలి.

మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankar Varaprasad Garu): సంక్రాంతి రియల్ విన్నర్?

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

  • బడ్జెట్ లెక్కలు: ఈ సినిమా బడ్జెట్‌లో సింహభాగం రెమ్యూనరేషన్లకే వెళ్ళినట్లు టాక్. కానీ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.
  • వసూళ్లు: ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. కేవలం మూడు రోజుల్లోనే రూ.152 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతానికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్ల వసూళ్లను దాటింది. మహిళా ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతుండటంతో సంక్రాంతి విన్నర్‌గా చిరంజీవి నిలిచారు.

చిన్న సినిమాల పెద్ద ధమాకా: శర్వానంద్ వర్సెస్ నవీన్

ఇకపోతే ఈ సారి యంగ్ హీరోల మధ్య పోటీ కూడా గట్టిగానే ఉంది.

  1. అనగనగా ఒక రాజు: నవీన్ పోలిశెట్టి మార్క్ కామెడీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రమోషన్స్ వల్ల ఈ సినిమా కలెక్షన్ల పరంగా సెకండ్ ప్లేస్‌లో ఉంది. నాలుగు రోజుల్లో ఈ సినిమా సుమారు రూ.20 కోట్లు నెట్ వసూలు చేసింది.
  2. నారీ నారీ నడుమ మురారి: శర్వానంద్ సినిమాకు కథ పరంగా, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా బెస్ట్ టాక్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా క్లాస్ ఆడియన్స్‌ ను బాగా ఆకట్టుకుంటోంది. మూడు రోజుల్లో ఈ సినిమా రూ.8 కోట్లు నెట్ వసూలు చేసింది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి: రవితేజకు మరో నిరాశేనా?

మాస్ రాజా రవితేజ ఈసారి ఒక డిఫరెంట్ రోల్‌తో వచ్చారు. సినిమా బాగున్నప్పటికీ, భారీ సినిమాల పోటీలో ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో ఈ సినిమా వెనుకబడింది. కలెక్షన్ల పరంగా ఇది నాలుగో స్థానంలో ఉంది. నాలుగు రోజుల్లో ఇది రూ.8 కోట్లు నెట్ వసూలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+