దేశంలో అత్యంత బ్రాండ్ విలువ కలిగిన ప్రముఖుల్లో రన్ వీర్ సింగ్ మొదటి స్థానంలో నిలిచాడు. రణవీర్ సింగ్ 2022లో భారతదేశపు అత్యంత విలువైన సెలబ్రిటీగా నిలిచాడు. "సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2022 బియాండ్ ది మెయిన్ స్ట్రీమ్" నివేదిక ప్రకారం రన్ వీర్ సింగ్ $181.7 మిలియన్ల బ్రాండ్ విలువతో ఉన్నాడు. ఐదు సంవత్సరాల పాటు అగ్రస్థానంలో ఉన్న క్రికెటర్ విరాట్ కోహ్లీని రెండో స్థానానికి పడిపోయాడు.
విరాట్ కోహ్లీ 176.9 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో రెండో స్థానానికి చేరాడు. భారత జట్టు కెప్టెన్సీని విడిచిపెట్టిన తర్వాత అతని బ్రాండ్ విలువ వరుసగా రెండు సంవత్సరాలు క్షీణించింది. అతని బ్రాండ్ విలువ 20220లో $237 మిలియన్లకు పైగా ఉంది. కానీ 2021లో బాగా తగ్గి $185.7 మిలియన్లకు చేరుకుంది. నటుడు అక్షయ్ కుమార్ 153.6 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో మూడో స్థానంలో నిలిచాడు. $102.9 మిలియన్ల విలువతో, నటి అలియా భట్ కూడా నాల్గో స్థానంలో నిలిచారు.

దీపికా పదుకొణె బ్రాండ్ వాల్యుయేషన్ $82.9 మిలియన్లతో ఐదో స్థానంలో ఉన్నారు. అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ బాలీవుడ్ నుంచి అత్యంత విలువైన ప్రముఖుల టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నారు. మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని 80 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో జాబితాలో ఆరో స్థానాన్ని ఆక్రమించాడు. మాజీ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 2022లో టాప్-10 క్లబ్‌లోకి ప్రవేశించి, $73.6 మిలియన్ల బ్రాండ్ విలువతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.
మొదటిసారి టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ అత్యంత బ్రాండ్ విలువ కలిగిన ప్రముఖుల్లో చోటు దక్కించుకున్నాడు. అల్లు అర్జున్ రూ.260 కోట్ల (3.14 కోట్ల డాలర్లు) బ్రాండు విలువతో 20వ స్థానంలో నిలిచాడు. రష్మిక మందన్న 25వ స్థానాన్ని దక్కించుకుంది. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాతో పాటు పీవీ సింధుతో కూడా టాప్ 25లో చోటు దక్కించుకున్నారు.


Click it and Unblock the Notifications