stock market today: భారత స్టాక్ మార్కెట్ రోజురోజుకు అమ్మకందారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దింతో నేడు వరుసగా ఐదవ రోజు కూడా షేర్ మార్కెట్ క్షీణతతో ముగిసింది. అలాగే బ్యాంకింగ్, ఆటో, మెటల్, ఐటీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు కనిపించాయి. మధ్యాహ్నం 2.09 గంటలకు బిఎస్‌ఇ సెన్సెక్స్ 1,227 పాయింట్లు లేదా 1.59% తగ్గి 76,084 వద్ద ట్రేడైంది. నిఫ్టీ 50 ఇండెక్స్ కూడా 23,000 పాయింట్ల దిగువకు చేరింది. అయితే, సాయంత్రం సెన్సెక్స్ కొద్దిగా మెరుగుపడి 76,293.60 వద్ద ముగిసింది, కానీ నిన్నటితో పోలిస్తే 1018.20 పాయింట్లు తక్కువ. మరోవైపు కొన్ని షేర్లు BSEలో 10% కంటే ఎక్కువ పెంపుతో ముగిశాయి.
10 లక్షల కోట్లు వృధా
ఇవాళ మంగళవారం స్టాక్ మార్కెట్ పతనం వల్ల దాదాపు రూ.10 లక్షల కోట్ల మేర పెట్టుబడిదారులు నష్టపోయారు. ఈ పతనం కారణంగా, BSEలో లిస్ట్ చేసిన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.9.87 లక్షల కోట్లు తగ్గింది. దింతో ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.407.95 లక్షల కోట్లకు చేరింది.

ఈ షేర్లు 10 శాతం పెరిగాయి
ఈ క్షీణత మధ్య కూడా కొన్ని స్టాక్‌లు 10 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను చూశాయి. వీటిలో క్యాపిటల్ ట్రస్ట్ (14.06%), టోయం ఇండస్ట్రీస్ (12.12%), ఇండియా ఫిన్‌సెక్ (11.45%), గార్మెంట్ మంత్ర లైఫ్ (11.17%) ఉన్నాయి. ఈ షేర్ల ధరల్లో భారి పెరుగుదల కనిపించింది. ఒక పక్క మార్కెట్ పడిపోతోన్నగాని ఈ స్టాక్స్ లాభాల్లో నడుస్తున్నాయి!
షేర్ మార్కెట్ టుడే
30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ 1018.2 పాయింట్లు తగ్గి 76293.6 వద్ద ముగిసింది. 50 షేర్లతో కూడిన NSE నిఫ్టీ కూడా 309.8 పాయింట్లు తగ్గి 23071.8 వద్ద ముగిసింది. అంటే మార్కెట్ మూడ్ అంత బాగా లేదని అర్థం. నిఫ్టీ 50లో కేవలం 4 స్టాక్‌లు మాత్రమే లాభాలతో ముగిశాయి. మిగిలిన 46 షేర్లు నష్టపోయాయి. సహజంగానే చాలా స్టాక్‌ల పనితీరు నిరాశపరిచింది.
52 వారాల గరిష్ట స్థాయికి ఈ స్టాక్స్
ఈరోజు ట్రేడింగ్ సమయంలో కొన్ని స్టాక్‌లు 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి. వీటిలో వాస్ ఇన్‌ఫ్రా, తపారియా టూల్స్, ఆర్‌డిబి రియల్ ఎస్టేట్ కాన్స్, దేశ్ రక్షక్ అండ్ యష్ ట్రేడింగ్ ఉన్నాయి. అలాగే కొన్ని స్టాక్‌లు 52 వారాలలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. వీటిలో రెట్రో గ్రీన్ రివల్యూషన్, బిఎఫ్ఎల్ అసెట్ ఫిన్‌వెస్ట్, సూపర్ టెక్స్ ఇండ్, ఎన్‌జిఎల్ ఫైన్ కెమ్, అసిత్ సి మెహతా ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications