ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్, ఈ స్టాక్స్ 10% పైగా జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నానికి డీలాపడ్డాయి. ఆ తర్వాత ఊగిసలాట మధ్య పయనించిన సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. ముఖ్యంగా రిలయన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇది సెంటిమెంట్‌ను దెబ్బ తీసింది. హెల్త్ కేర్ ఇండెక్స్ రెండు శాతం లాభపడింది. మెటల్, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు ఒక శాతం నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీలు 0.4 శాతం లాభపడ్డాయి. స్మాల్ క్యాప్ సూచీ 0.2 శాతం నష్టపోయింది. షాంఘై మినహా ఆసియా మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి.
సెన్సెక్స్ 32.02 (0.053%) పాయింట్లు లాభపడి 60,718.71 పాయింట్ల వద్ద, నిఫ్టీ 6.70 (0.037%) పాయింట్లు లాభపడి 18,109.45 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 60,837.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 61,036.56 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,597.36 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,140.95 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,210.15 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 18,071.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, HDFC, యాక్సిస్ బ్యాంకు,
ITC, టాటా మోటార్స్ లాభపడ్డాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోషన్ 3.46 శాతం, సిప్లా 2.42 శాతం, ITC 2.23 శాతం, ONGC 2.04 శాతం, UPL 1.88 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో కోల్ ఇండియా 4.31 శాతం, టాటా స్టీల్ 3.25 శాతం, హిండాల్కో 2.70 శాతం, JSW స్టీల్ 1.47 శాతం, ఐచర్ మోటార్స్ 1.42 నష్టపోయాయి.
నేడు పలు స్టాక్స్ పది శాతానికి పైగా లాభపడ్డాయి. మీరా ఇండస్ట్రీస్(14.7%), లవబుల్ లింగరీ(14.07%), మీర్జా Intnl(14.06%), ఫైన్ ఆర్గానిక్ ఇండ్(13.88%), సుప్రజిత్ ఇంజినీరింగ్(12.71%), బాంబే ఆక్జిన్ ఇన్వెస్ట్(11.36%), అన్మోల్ ఇండియా(11.16%), HKG లిమిటెడ్ (10.71%), సులభ్ ఇంజినీర్ (10.0%) లాభపడ్డాయి.