2000 నోట్ల మార్చుకునే గడువు శనివారంతో ముగియనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబరు 30 తర్వాత రూ. 2,000 డినామినేషన్ బ్యాంక్ నోటు చెల్లదని స్పష్టం చేసింది. 2000 రూపాయల నోట్లను తిరిగి ఇవ్వడానికి సెప్టెంబర్ 30 గడువును అక్టోబర్ చివరి వరకు పొడిగించే అవకాశం ఉందని వార్తలు వచ్చినప్పటికీ ఎలాంటి గడువు పొడిగించలేదు.
మే 19న, RBI రూ.2000 నోట్లను చెలామణి నుంచి తీసివేసింది. నోట్లను మార్చుకోవడానికి దాదాపు నాలుగు నెలల సమయం ఇచ్చింది. ఈ నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి RBI ఇచ్చిన చివరి తేదీ సెప్టెంబర్ 30 అంటే ఈరోజుతో ముగుస్తుంది. ఈ రోజు 5వ శనివారం బ్యాంకులు తెరిచి ఉంటాయి. మీ వద్ద ఇప్పటికీ రూ. 2000 నోట్లు ఉంటే సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోవచ్చు. రూ.2,000 నోట్లను బ్యాంకులతో RBI ప్రాంతీయ శాఖలలో మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేయవచ్చు.

ఖాతా లేని వ్యక్తి ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌లో ఒకేసారి రూ.20,000 పరిమితి వరకు రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. సెప్టెంబరు 30 తర్వాత, నోట్లు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతాయి. మే 19న చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 93 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు సెప్టెంబర్ 2న ఆర్బీఐ తెలిపింది. ప్రధాన బ్యాంకుల నుండి సేకరించిన సమాచారం ప్రకారం రూ.2000 డినామినేషన్‌లో ఉన్న మొత్తం నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో ఉండగా, దాదాపు 13 శాతం ఇతర డినామినేషన్ నోట్లలోకి మార్చారు.
ఇప్పటికీ దాదాపు 240 బిలియన్ రూపాయలు లేదా $2.9 బిలియన్ విలువైన నోట్లు చెలామణిలో ఉన్నట్లు తెలుస్తోంది. మే 19న, RBI రూ.2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. రూ.2000 డినామినేషన్ బ్యాంక్ నోట్ నవంబర్ 2016లో ప్రవేశపెట్టబడింది, ప్రాథమికంగా ఆ సమయంలో చలామణిలో ఉన్న మొత్తం రూ.500, రూ.1000 నోట్ల చట్టబద్ధమైన టెండర్ స్థితిని ఉపసంహరించుకున్న తర్వాత ఆర్థిక వ్యవస్థ కరెన్సీ అవసరాన్ని త్వరగా తీర్చడానికి 2000 నోట్లను తీసుకొచ్చారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications