Live

Today Gold Silver Rate Live: మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఈ రోజే రేట్లు ఎలా ఉన్నాయంటే..

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో, మే 12న భారత మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. MCX గోల్డ్ ధర రూ. 1.54 లక్షల మార్కును దాటగా, వెండి మాత్రం ఏకంగా 1.2% లాభపడి రూ. 2.82 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. హార్ముజ్ జలసంధి మూసివేత చాలా కాలంగా కొనసాగుతుండటంతో చమురు ధరలు కూడా పెరిగాయి. యూఎస్ WTI క్రూడ్ ఆయిల్ 100 డాలర్ల మార్కు దగ్గర, బ్రెంట్ క్రూడ్ 105 డాలర్ల మార్కు పైన ట్రేడ్ అవుతున్నాయి.

మరోవైపు, స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $4,730 డాలర్ల వద్ద స్వల్పంగా తగ్గింది. అయితే, స్పాట్ సిల్వర్ మాత్రం ఔన్సుకు 86 డాలర్ల పైకి చేరింది.

డాలర్ విలువ పుంజుకోవడం కూడా బంగారంపై ఒత్తిడి పెంచింది. టెహ్రాన్ శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన తర్వాత, అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగడం దాదాపు అసాధ్యమని ("మాసివ్ లైఫ్ సపోర్ట్" మీద ఉందని) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

Gold price today  Silver price today  Gold rate live  MCX Gold  Middle East tensions impact on gold  22K Gold price  24K Gold price  Silver rate today Telugu

దీంతో కీలకమైన నౌకాయాన మార్గం చాలా కాలం పాటు మూసివేతకు గురవుతుందనే ఆందోళనలు తీవ్రమయ్యాయి. సైనిక చర్యలను మళ్లీ ప్రారంభించడం, హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకలకు ఎస్కార్ట్ కల్పించడం వంటి అంశాలపై చర్చించేందుకు ట్రంప్ తన జాతీయ భద్రతా బృందంతో సమావేశం కానున్నట్లు సమాచారం. అదే సమయంలో, ఇరాన్ సంక్షోభం ధరలపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలుసుకోవడానికి, పెట్టుబడిదారులు తాజా యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాల కోసం ఎదురుచూస్తున్నారని ట్రేడింగ్ ఎకనామిక్స్ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+