Live

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

గ్లోబల్ మార్కెట్ల బలహీన సంకేతాల కారణంగా, జూన్ 23, 2026 తెల్లవారుజామున భారతదేశంలో బంగారం, వెండి ధరలు భారీగా కుప్పకూలాయి. MCX గోల్డ్ ధర దాదాపు రూ. 1,400 (1%) పతనమై 10 గ్రాములకు రూ. 1,46,750 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక MCX వెండి ధర ఏకంగా రూ. 6,150 (2.7%) పైగా నష్టపోయి రూ. 2,28,200 దిగువకు పడిపోయింది.

స్పాట్ గోల్డ్ ధర 1% పతనమై ఔన్సుకు $4,150 వద్ద కదలాడుతుండగా, స్పాట్ సిల్వర్ ధర 2% పైగా నష్టపోయి ఔన్సుకు $64 డాలర్ల దిగువకు చేరింది.

మరోవైపు, ముడి చమురు ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. జూన్ 23, 2026 తెల్లవారుజామున 4% పతనమైన US WTI క్రూడ్ ఆయిల్, తిరిగి బ్యారెల్‌కు $74 మార్కును చేరుకుంది. అలాగే, దాదాపు 3.5% క్షీణించిన బ్రెంట్ క్రూడ్ కూడా బ్యారెల్‌కు $78 సమీపానికి కోలుకుంది.

Gold rate today  Silver rate today  Gold price live  MCX Gold price  Gold rate in India  22K Gold price  24K Gold price  Silver price fall  Gold price crash

ఇక తాజా పరిణామాలను గమనిస్తే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు కొత్త హెచ్చరిక జారీ చేశారు. శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉండకపోయినా, లేదా "సరిగ్గా ప్రవర్తించకపోయినా.. నేను చేయాల్సింది నేను చేస్తాను" అని ట్రంప్ విలేకరులతో అన్నారు.

ప్రపంచ మార్కెట్లన్నీ ప్రస్తుతం యూఎస్-ఇరాన్ శాంతి చర్చల పైనే దృష్టి సారించాయి. ఈ చర్చలు విజయవంతమైతే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గి, ప్రపంచ ఇంధన సంక్షోభానికి అడ్డుకట్ట పడుతుందని అందరూ ఆశిస్తున్నారు.

ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడులు కొనసాగిస్తే సైనిక చర్య తప్పదని, అలాగే హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్‌ను హెచ్చరించారు. ఇదే సమయంలో, ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా టెహ్రాన్ చర్చలను నిలిపివేసినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అయితే, చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ఫెడరల్ రిజర్వ్ కఠిన ద్రవ్య విధానం అవలంబిస్తుందన్న అంచనాలు కూడా బంగారంపై ఒత్తిడి పెంచాయి. గత వారం ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, కఠిన వైఖరిని అవలంబించింది. ట్రేడింగ్ ఎకనామిక్స్ ప్రకారం, ఫెడ్‌లోని 19 మంది పాలసీమేకర్లలో తొమ్మిది మంది ఈ ఏడాది కనీసం ఒకసారైనా వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని భావిస్తున్నారు. సెప్టెంబర్‌లోనే ఈ పెంపు ఉండవచ్చని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+