Live

Today Gold Silver Rate Live: భారీ పతనం తర్వాత పుంజుకున్న బంగారం ధరలు

నిన్నటి భారీ పతనం తర్వాత, భారతదేశంలో బంగారం, వెండి ధరలు మంగళవారం (జూన్ 9, 2026) మళ్లీ పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న స్పాట్ గోల్డ్ ధర.. ఇవాళ దాదాపు 0.6% పెరిగి ఔన్సుకు 4,330 డాలర్ల పైకి చేరింది. ఇదే బంగారం ధరల పెరుగుదలకు కారణంగా నిలుస్తోంది. అయితే, వెండి ధరపై మాత్రం ఒత్తిడి కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ ధర 1% తగ్గి ఔన్సుకు 68 డాలర్ల దిగువనే ట్రేడ్ అవుతోంది. ఇక ముడి చమురు విషయానికొస్తే, యూఎస్ డబ్ల్యూటీఐ, బ్రెంట్ క్రూడ్ ధరలు చెరో 1% తగ్గి బ్యారెల్‌కు వరుసగా 90 డాలర్లు, 93 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు, డాలర్ ఇండెక్స్ 100 మార్కు దిగువకు పడిపోవడం కూడా బంగారం వంటి విలువైన లోహాలకు కలిసొచ్చే అంశం.

గత తొమ్మిది వారాల గరిష్ఠ స్థాయి నుంచి డాలర్ వెనక్కి తగ్గడంతో.. బంగారం ధరలకు స్థిరమైన మద్దతు లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం, ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులను నిలిపివేయాలని అంగీకరించడమే ఇందుకు కారణం.

Gold rate today  Silver rate today  Gold price live  22K gold price  24K gold price  Gold rate in India  Silver price today India  Today gold rate Telugu

ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నాయని, తుది విడత చర్చలు కూడా జరుగుతున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయినప్పటికీ, అమెరికాలో ఉద్యోగాల డేటా అంచనాలను మించి బలంగా ఉండటంతో డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ ర్యాలీ చేశాయి. దీంతో, ఈ ఏడాది చివరి నాటికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు బలపడ్డాయి. ఈ కారణాలతో బంగారం ధర మార్చి చివరి నుంచి చూస్తే అత్యంత కనిష్ఠ స్థాయిల వద్దే కొనసాగుతోంది. డిసెంబర్‌లో ఫెడ్ పావు శాతం వడ్డీ రేటును పెంచేందుకు దాదాపు 70% అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫెడ్ పాలసీపై మరిన్ని స్పష్టమైన సంకేతాల కోసం ఇన్వెస్టర్లు ఈ వారం విడుదలయ్యే అమెరికా సీపీఐ (CPI), పీపీఐ (PPI) డేటా కోసం ఎదురుచూస్తున్నారని ట్రేడింగ్ ఎకనామిక్స్ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+