Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరల్లో ఆగస్టు నెల మొదటి రోజే మిశ్రమ స్పందన కనిపించింది. శనివారం, 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ఏకంగా రూ.4,000 వరకు తగ్గగా, 10 గ్రాములపై రూ.400 పడిపోయింది. అయితే, వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి సుమారు రూ.2.35 లక్షల వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఒక్క రాత్రిలోనే దాదాపు 1.5% పడిపోయి, ఔన్సుకు $4,043 డాలర్లకు చేరడంతో దేశీయంగా ఫిజికల్ గోల్డ్ ధరలు తగ్గాయి. స్పాట్ సిల్వర్ ధర ఇంకా ఎక్కువగా 2.4% కుప్పకూలి ఔన్సుకు $57.62 డాలర్ల దిగువన నిలిచింది. జూలై 2026 నెలను MCX గోల్డ్ 10 గ్రాములకు రూ.1,41,600 దిగువన ముగించగా, MCX సిల్వర్ కిలోకు రూ.2,17,500 కంటే తక్కువలో ఉంది.

అయినప్పటికీ, జూలై 2026 నెలలో వెండితో పోలిస్తే బంగారం మెరుగైన ప్రదర్శన కనబరిచింది. 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ల బంగారం ధరలు నెలవారీగా 2% పైగా లాభపడ్డాయి. మరోవైపు, వెండి ధరలు మొత్తం మీద 2-3% వరకు నష్టపోయాయి.

Gold Rate Today  Silver Rate Today  Gold Price Telugu  22K Gold Price  24K Gold Price  MCX Gold  US Fed  Gold Price Fall

ఈ వారం, పెరిగిన ముడి చమురు ధరలు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ కదలికలు వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపాయి.

అంతేకాకుండా, మార్కెట్‌లో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ, జూలై నెలలో స్పాట్ గోల్డ్ 0.5% లాభపడింది. ఫిబ్రవరి తర్వాత బంగారం నెలవారీగా లాభపడటం ఇదే తొలిసారి. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం ఇందుకు దోహదపడింది. అయితే, భవిష్యత్తులో కఠిన ద్రవ్య విధానం అమలు చేస్తారనే అంచనాలతో లాభాలు పరిమితంగానే ఉన్నాయి. సెప్టెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడానికి దాదాపు 65% అవకాశం ఉందని మార్కెట్లు భావిస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తామని ఫెడ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్ పునరుద్ఘాటించినప్పటికీ, వడ్డీ రేట్ల పెంపుపై తక్షణ సంకేతాలు ఇవ్వలేదు. కానీ, ఈ వారం ఫెడ్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ముగ్గురు అధికారులు మాత్రం శుక్రవారం మాట్లాడుతూ, మరిన్ని కఠిన చర్యలు అవసరమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. ఇరాన్ లక్ష్యాలపై అమెరికా కొత్తగా దాడులు చేయడంతో దౌత్యపరమైన పరిష్కార ఆశలు తగ్గాయి. ట్రేడింగ్ ఎకనామిక్స్ ప్రకారం, ఫిబ్రవరి చివర్లో ఈ వివాదం మొదలైనప్పటి నుంచి, పెరిగిన చమురు ధరలు ద్రవ్యోల్బణ ఆందోళనలను పెంచాయి. దీనివల్ల వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలు బలపడి, బంగారంపై ఒత్తిడి పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+