Today Gold Silver Rate Live: ఇరాన్ యుద్ధం వేళ బంగారం, వెండి ధరలు ఇలా..

భారత్‌లో బంగారం, వెండి ధరలు మే 8, 2026, శుక్రవారం రోజున స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పసిడి, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 1% పైగా పెరిగి బ్యారెల్‌కు 102 డాలర్ల వద్దకు చేరగా, యూఎస్ డబ్ల్యూటీఐ క్రూడ్ 96 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు, ఎంసీఎక్స్ (MCX) గోల్డ్ రూ. 1,52,500 లక్షల మార్క్ వద్ద, ఎంసీఎక్స్ సిల్వర్ రూ. 2.59 లక్షల మార్క్ వద్ద కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,710 డాలర్లకు పైగా పెరిగింది. స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 80 డాలర్ల సమీపంలోకి దూసుకెళ్లింది. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, శాంతి ఒప్పందంపై ఆశలు సన్నగిల్లడంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై ప్రభావం పడింది. ఈ పరిణామాలతో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనలు మరింత ఎక్కువయ్యాయి.

Today Gold Silver Rate Live  Prices Rise Amid US-Iran Tensions

ఇరాన్ దాడులను అమెరికా బలగాలు అడ్డుకున్నాయని, ప్రతిగా రక్షణాత్మక దాడులు చేశాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు హార్ముజ్ జలసంధి గుండా వెళ్లాయని, అయితే తాము ఉద్రిక్తతలను మరింత పెంచాలని కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. మరోవైపు, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, దాదాపు 10 వారాలుగా కొనసాగుతున్న వివాదాన్ని ముగించేందుకు ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై ఇరాన్ స్పందన కోసం అమెరికా ఎదురుచూస్తోంది. ట్రేడింగ్ ఎకనామిక్స్ నివేదికల ప్రకారం, రాబోయే రెండు రోజుల్లో పాకిస్థాన్ ద్వారా టెహ్రాన్ తన సమాధానాన్ని పంపే అవకాశం ఉంది. ఇక యూఎస్ డాలర్ కూడా గత సెషన్ల నుంచి లాభపడుతూ 98 మార్క్‌ను దాటింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+