gold rates: నేటి బంగారం, వెండి ధరలు.. జనవరి 18న ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
పెట్టుబడిదారులకు అత్యంత సురక్షితమైన మార్గంగా పేరున్న బంగారం ధరలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ద్రవ్యోల్బణం పెరిగినా, స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు వచ్చినా సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ బంగారం ధరల (gold rates) పైనే కన్నేసి ఉంచుతారు. అయితే కొన్ని రోజులుగా బంగారం ధరలు నిలకడగా ఉంటూ వస్తున్నాయి. ఈరోజు జనవరి 18, 2026 నాటి లేటెస్ట్ మార్కెట్ అప్‌డేట్స్ ప్రకారం, బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

నేడు బంగారం ధరలు (1 గ్రాము)..
భారతదేశ వ్యాప్తంగా ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
- • 24 క్యారెట్ల బంగారం (స్వచ్ఛమైన బంగారం): రూ. 14,378
- • 22 క్యారెట్ల బంగారం (ఆభరణాల బంగారం): రూ. 13,180
- • 18 క్యారెట్ల బంగారం: రూ. 10,784
నిన్నటితో పోలిస్తే ఈరోజు ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. నిన్న 24 క్యారెట్ల గ్రాము ధర రూ. 14,378 గా ఉండగా.. ఈరోజు కూడా అదే ధరకు అందుబాటులో ఉంది. అయితే ప్రాంతీయ పన్నులు, రవాణా ఖర్చుల వల్ల వివిధ నగరాల్లో ధరలు స్వల్పంగా మారుతుంటాయి.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (1 గ్రాము)..
• హైదరాబాద్: 24 క్యారెట్లు రూ. 14,378 ., 22 క్యారెట్లు రూ. 13,180
• విజయవాడ: 24 క్యారెట్లు రూ. 14,378 ., 22 క్యారెట్లు రూ. 13,180
• చెన్నై: 24 క్యారెట్లు రూ. 14,487 ., 22 క్యారెట్లు రూ. 13,280
• బెంగళూరు: 24 క్యారెట్లు రూ. 14,378., 22 క్యారెట్లు రూ. 13,180
• ముంబై: 24 క్యారెట్లు రూ. 14,378 ., 22 క్యారెట్లు రూ. 13,180
• కోల్‌కతా: 24 క్యారెట్లు రూ. 14,378 ., 22 క్యారెట్లు రూ. 13,180
వెండి ధరలు కూడా పైపైకే..
గత కొన్ని రోజులుగా వెండి ధలరు రికార్డు స్థాయిలో పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండికి కూడా భారతీయుల్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పారిశ్రామిక అవసరాలు , ఆభరణాల తయారీలో వెండి పాత్ర కీలకం.
- 1 గ్రాము వెండి ధర: రూ. 295
- 1 కేజీ వెండి ధర: రూ. 2,95,000
ధరలు ఎందుకు మారుతుంటాయి?
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరగడం, అంతర్జాతీయ పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉండే గోల్డ్ రిజర్వులు వంటి కారణాల వల్ల బంగారం ధరలు (gold rates) నిరంతరం మారుతుంటాయి. భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ లేదా పండగల సమయంలో స్థానిక డిమాండ్ పెరగడం వల్ల కూడా ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.
ఏదేమైనా బంగారం కేవలం అలంకారానికే కాదు, ఆపద కాలంలో ఆదుకునే ఆస్తిగా కూడా పనిచేస్తుంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలరీ షాపుల్లో ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది. అలాగే బంగారంలో ఇన్వెస్ట్ చేసేవాళ్లు నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications