Gold rates: బంగారం కొనాలనుకుంటున్నారా? లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఇవే!
తరతరాలుగా భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక పటిష్టమైన ఆస్తి. ఆర్థిక మాంద్యం వచ్చినా, మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనా సంపదను కాపాడుకోవడానికి పసిడిని మించిన సురక్షితమైన పెట్టుబడి మరొకటి లేదు. అందుకే ముహుర్తాలు ఉన్నా లేకపోయినా, భారతీయులు ఎప్పుడూ బంగారం ధరల (gold rates) పై ఒక కన్నేసి ఉంచుతారు.

నేడు భారత్‌లో బంగారం ధరలు (జనవరి 04, 2026)..
నేడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే పెద్దగా మార్పు కనిపించలేదు. నేటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి..
- 24 క్యారెట్ల బంగారం (స్వచ్ఛమైన బంగారం): 1 గ్రాము ధర రూ.13,582 కాగా, 10 గ్రాముల (తులం) ధర రూ.1,35,820 గా ఉంది.
- 22 క్యారెట్ల బంగారం (ఆభరణాల బంగారం): 1 గ్రాము ధర రూ.12,450 గా ఉంది.
- 18 క్యారెట్ల బంగారం: 1 గ్రాము ధర రూ.10,187 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు..
మన దేశంలో పన్నులు, రవాణా ఖర్చుల వల్ల నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.
- హైదరాబాద్: 24 క్యారెట్.. రూ.13,582., 22 క్యారెట్.. రూ.12,450
- విజయవాడ: 24 క్యారెట్.. రూ.13,582 ., 22 క్యారెట్.. రూ.12,450
- బెంగళూరు: 24 క్యారెట్.. రూ.13,582., 22 క్యారెట్.. రూ.12,450
- చెన్నై: 24 క్యారెట్.. రూ.13,746 ., 22 క్యారెట్.. రూ.12,600
- ఢిల్లీ: 24 క్యారెట్.. రూ.13,597., 22 క్యారెట్.. రూ.12,465
- ముంబై: 24 క్యారెట్.. రూ.13,582 ., 22 క్యారెట్.. రూ.12,450
- కోల్‌కతా: 24 క్యారెట్.. రూ.13,582., 22 క్యారెట్.. రూ.12,450
ధరలు ఎందుకు మారుతుంటాయి?
బంగారం ధరలను కేవలం మన దేశీ డిమాండ్ మాత్రమే కాదు, అంతర్జాతీయ కారకాలు కూడా శాసిస్తాయి. గ్లోబల్ మార్కెట్ లో బంగారం ధర పెరగడం, అమెరికన్ డాలర్ విలువలో మార్పులు, పెళ్లిళ్ల సీజన్‌లో పెరిగే డిమాండ్ వంటివి బంగారం ధరలు (gold rates) ను ప్రభావితం చేస్తాయి.
వెండి ధరలు కూడా తగ్గడం లేదు!
బంగారంతో పాటే వెండికి కూడా మన దేశంలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పూజా సామాగ్రి, బహుమతుల కోసం వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్లో సోలార్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో వెండికి భారీ డిమాండ్ ఉండడం అలాగే మార్కెట్లో వెండికి డిమాండ్ అండ్ సప్లైలో తేడాలు ఉండడం వల్ల కూడా వెండికి డిమాండ్ బాగా పెరిగింది. అలాగే మనదేశంలో వెండి వస్తువుల వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల దీని ధరల్లో ఒడిదుడుకులు ఉంటాయి. నేటి వెండి ధరలు 1 గ్రాము రూ. 241 కాగా, కిలో వెండి ధర రూ.2,41,000 గా ఉన్నాయి.
మొత్తంగా పెట్టుబడి దృష్ట్యా చూస్తే బంగారం ఎప్పుడూ లాభదాయకమే. అయితే ధరలు నిత్యం మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు లోకల్ జువెలర్స్ వద్ద లైవ్ ధరలను సరిచూసుకోవడం మంచిది. పైన పేర్కొన్న ధరలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.


Click it and Unblock the Notifications