భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఇవాళ మళ్ళీ షాకిచ్చాయి. దింతో నేడు తులం ధర రూ.450 నుండి రూ.490 పెరిగింది. ఇక పసిడి బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతూ కేజీకి రూ.1000 పెరిగింది. అయితే నిన్న ఇవాళ చూస్తే 10 గ్రాముల బంగారం ధర 3 వేలు పెరగటం గమనార్షం. మరోవైపు వెండి ధర కూడా ఈ రెండు రోజుల్లో 4 వేలు ఎగబాకింది. ఇప్పటికే లక్షకి పైగా స్థిరపడ్డ వెండి ధర నేడు ఆల్ రికార్డ్ సెట్ చేసింది. అయితే ఈ ధరల పెంపు ట్రెండ్ ఇలానే కొనసాగితే బంగారం తులం ధర మళ్ళీ లక్ష దాటడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు.
భారత్ పాక్ కాల్పుల సీజ్ ఫైర్, అమెరికా - చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం, రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ అంచనాల కారణంగా బంగారం సురక్షిత పెట్టుబడిగా బలహీనపడిందని HDFC సెక్యూరిటీస్ సీనియర్ కమోడిటీ నిపుణుడు సౌమిల్ గాంధీ అన్నారు. దీనితో పాటు వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న కఠిన వైఖరి కూడా పెట్టుబడిదారులలో అనిశ్చితిని పెంచింది.
ప్రపంచ మార్కెట్ల ట్రెండ్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారుల ప్రకటన, దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పన్నులు ఇంకా వ్యయ ప్రతిపాదనపై పార్లమెంటులో జరిగే ఓటింగ్ కోసం పెట్టుబడిదారులు ఇప్పుడు ఎదురుచూస్తున్నారని, ఇది అమెరికా ఆర్థిక లోటును మరింత పెంచే అవకాశం ఉందని కోటక్ సెక్యూరిటీస్ AVP కైనత్ చైన్వాలా అన్నారు. అయితే, వీటి కారణంగా ప్రస్తుతం బంగారం ధరలు పెద్దగా తగ్గే అవకాశం తక్కువగా ఉంది.
US డాలర్ ప్రభావం: తాజాగా US డాలర్ ఇండెక్స్ (DXY) 0.07% తగ్గి 100.36 దగ్గర ఉండగా, డాలర్ బలహీనత బంగారం ఇంకా వెండి ధరలకు కొంత మద్దతునిచ్చింది. అమెరికా అప్పులు పెరగడం వల్ల బంగారం, వెండిలో సురక్షితమైన పెట్టుబడికి డిమాండ్ పెరగడంతో మూడీస్ రేటింగ్‌ను తగ్గించింది. కానీ రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల ఆశలు వీటి ధరల లాభాలను పరిమితం చేశాయి. ఈ వారం బంగారం, వెండి ధరల్లో మరిన్ని హెచ్చుతగ్గులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం డాలర్ ఇండెక్స్ అస్థిరత అలాగే రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు. బంగారం ఔన్సుకు $3,120 స్థాయికి పడిపోవచ్చని ఇంకా వెండి ఔన్సుకు $31.40 స్థాయికి తగ్గవచ్చని అంచనా.
ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,162 నుంచి రూ.97,910కి ఎగిసి సుమారు రూ.20 వేల దాకా పెరిగింది. అలాగే వెండి ధర కూడా సుమారు రూ.10 వేల దాకా పెరిగి కిలోకు రూ.90,500 నుంచి రూ.101,000కి చేరుకుంది. గత సంవత్సరంతో పోల్చితే అంటే 2024లో ఇదే సమయంలో బంగారం ధర రూ.12,810 పెరిగింది.

ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.45 పెరిగి రూ.8,975, 24 క్యారెట్ల ధర రూ.49 ఎగిసి రూ.9,791, 18 క్యారెట్ల ధర రూ.37 పెంపుతో రూ.7,344. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.89,750, నిన్నటి ధర రూ.89,300 అంటే రూ.450 పెరిగింది, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.97,910, నిన్నటి ధర చూస్తే రూ.97,420 దింతో రూ.490 పెరగ్గా, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.73,440, నిన్నటి ధర రూ.73,070 అంటే రూ.370 పెంపును నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే :
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.89,310, 24 క్యారెట్లకు రూ.97,430, 18 క్యారెట్లకు రూ.73,080.
కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.89,310, 24 క్యారెట్లకు రూ.97,430, 18 క్యారెట్లకు రూ.73,080.
ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.89,310, 24 క్యారెట్లకు రూ.97,430, 18 క్యారెట్లకు రూ.73,080.
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.89,750, 24 క్యారెట్లకు రూ.97,910, 18 క్యారెట్లకు రూ.73,440.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు చూస్తే :
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.89,310, 24 క్యారెట్లకు రూ.97,430, 18 క్యారెట్లకు రూ.73,080.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.89,310, 24 క్యారెట్లకు రూ.97,430, 18 క్యారెట్లకు రూ.73,080.
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.89,310, 24 క్యారెట్లకు రూ.97,430, 18 క్యారెట్లకు రూ.73,080.
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.89,310, 24 క్యారెట్లకు రూ.97,430, 18 క్యారెట్లకు రూ.73,080.
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.89,310, 24 క్యారెట్లకు రూ.97,430, 18 క్యారెట్లకు రూ.73,080.
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.89,310, 24 క్యారెట్లకు రూ.97,430, 18 క్యారెట్లకు రూ.73,080.
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.89,310, 24 క్యారెట్లకు రూ.97,430, 18 క్యారెట్లకు రూ.73,080.
కడపలో 22 క్యారెట్ల ధర రూ.89,310, 24 క్యారెట్లకు రూ.97,430, 18 క్యారెట్లకు రూ.73,080.
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.89,310, 24 క్యారెట్లకు రూ.97,430, 18 క్యారెట్లకు రూ.73,080.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.101గా ఉండగా, 10 గ్రాములకి రూ.1010, కేజీకి నేడు రూ.1,01,000 అంటే ఇవాళ వెండి ధర రూ.1000 పెరిగింది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,01,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,12,000.
1243 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.3 శాతం పెరిగి $3,298.19 డాలర్ల వద్ద ఉండగా, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం పెరిగి $3,300.40 డాలర్ల వద్ద ఉంది. వెండి ధర ఔన్సుకు 0.1 శాతం పెరిగి $33.10 డాలర్ల వద్ద ఉండగా, ప్లాటినం ధర 0.4 శాతం పెరిగి $1,057.57 డాలర్ల వద్ద ఉంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications