కాశ్మీర్‌లో భారత పర్యాటకులపై ఇటీవల జరిగిన దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్ర వాద స్థావరాలపై భారత్ నేడు తెల్లవారుజామున దాడులు చేసింది. ఈ దాడుల తర్వాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. భారత దాడుల చర్యకు స్పందిస్తు పాకిస్తాన్ ఇప్పటి వరకు 26 మంది మరణించినట్లు ప్రకటించింది. అయితే నేడు ఉదయం బంగారం ధరలు వరుసగా మూడవ రోజు కూడా పెరిగాయి. దింతో తులం ధర ఇవాళ రూ.540కి పైగా పెరగ్గా, వెండి ధర మాత్రం కేజీకి రూ.2,100 పెరిగింది. ఈ వారంలో ఇప్పటివరకు గడిచిన 3 రోజుల్లో పసిడి ధర 24 క్యారెట్లకు సుమారు రూ.1,000 దాకా పెరిగిందని చెప్పవచ్చు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు మరోసారి సుంకాలకు సంబంధించి మరో ప్రకటన చేసారు. అమెరికా కాకుండా బయట దేశాల్లో తయారయ్యే ఫార్మా అండ్ సినిమాలపై 100% సుంకాన్ని ప్రకటించింది. దింతో ప్రపంచ వ్యాప్తంగా మరోసారి వాణిజ్య సుంకాల ఉద్రిక్తత పెరిగింది. ట్రంప్ ప్రకటనతో ఈ ఉద్రిక్తత కారణంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బంగారం ధరలు జస్ట్ మూడు రోజుల్లోనే రూ.4 వేలు పెరిగింది. దీని అర్థం బంగారం ధరలు మళ్ళీ ఎన్నడూ లేని విధంగా సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకోనున్నాయి.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పీఓకేలో సైనిక దాడుల తర్వాత భారతదేశం - పాకిస్తాన్ మధ్య ఇటీవల పెరిగిన ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్లలో అనిశ్చితిని రేకెత్తించాయి. గోల్డ్ మార్కెట్లో ఇన్స్టంట్ హెచ్చుతగ్గులను చూసినప్పటికీ ఫైనాన్షియల్ మార్కెట్లు ఇంకా ఎటువంటి మార్పులను చూపించలేదు. భరత్ పాక్ మధ్య దాడులు, ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న సుంకాల భయాలతో సహా ఇప్పటికే లక్షకి చేరువలో ఉన్న బంగారం ధరలు మరోసారి లక్ష దాటేందుకు ఎక్కువ సమయం కూడా పట్టకపోవచ్చు అని నిపుణు చెబుతున్నారు.
ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.50 పెరిగి రూ.9,075, 24 క్యారెట్ల ధర రూ.54 పెరిగి రూ.9,900, 18 క్యారెట్ల ధర రూ.41 పెరిగి రూ.7,425. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.90,750, నిన్నటి ధర రూ.90,250 అంటే రూ.500 పెరగ్గా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.99,000, నిన్నటి ధర చూస్తే రూ.98,460 దింతో రూ.540 పెరిగింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.74,250, నిన్నటి ధర రూ.73,840 అంటే రూ.410 పెంపును నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే : వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.90,750, 24 క్యారెట్లకు రూ.99,000, 18 క్యారెట్లకు రూ.74,250. కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.90,750, 24 క్యారెట్లకు రూ.99,000, 18 క్యారెట్లకు రూ.74,250. ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.90,750, 24 క్యారెట్లకు రూ.99,000, 18 క్యారెట్లకు రూ.74,250. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.90,750, 24 క్యారెట్లకు రూ.99,000, 18 క్యారెట్లకు రూ.74,250.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు చూస్తే విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.90,750, 24 క్యారెట్లకు రూ.99,000, 18 క్యారెట్లకు రూ.74,250. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.90,750, 24 క్యారెట్లకు రూ.99,000, 18 క్యారెట్లకు రూ.74,250. అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.90,750, 24 క్యారెట్లకు రూ.99,000, 18 క్యారెట్లకు రూ.74,250. గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.90,750, 24 క్యారెట్లకు రూ.99,000, 18 క్యారెట్లకు రూ.74,250. నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.90,750, 24 క్యారెట్లకు రూ.99,000, 18 క్యారెట్లకు రూ.74,250. కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.90,750, 24 క్యారెట్లకు రూ.99,000, 18 క్యారెట్లకు రూ.74,250. తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.90,750, 24 క్యారెట్లకు రూ.99,000, 18 క్యారెట్లకు రూ.74,250. కడపలో 22 క్యారెట్ల ధర రూ.90,750, 24 క్యారెట్లకు రూ.99,000, 18 క్యారెట్లకు రూ.74,250. అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.90,750, 24 క్యారెట్లకు రూ.99,000, 18 క్యారెట్లకు రూ.74,250.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.99గా ఉండగా, 10 గ్రాములకి రూ.990, కేజీకి నేడు రూ.99,000 అంటే ఇవాళ వెండి కేజీ ధర రూ.2,100 తగ్గింది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.99,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,11,000. ఇక ఇతర విలువైన లోహాలలో స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.7 శాతం తగ్గి $33.01కి చేరుకుంది, ప్లాటినం 0.1 శాతం తగ్గి $983.60కి చేరుకోగా, పల్లాడియం 0.7 శాతం తగ్గి $967.64కి చేరుకుంది.
భారత స్టాక్ మార్కెట్ : భారత సైన్యం ఈ చర్యకు భారత స్టాక్ మార్కెట్ కూడా స్పందించింది. బిఎస్‌ఇ సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు నష్టపోయింది, కానీ ఈ క్షీణత ఎక్కువ కాలం కొనసాగలేదు. దీని తర్వాత వెంటనే మార్కెట్ రికవరీ మోడ్‌లోకి వచ్చింది.
కరాచీ స్టాక్ మార్కెట్ : పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ KSE 100 బుధవారం భారీ క్షీణతను చూస్తోంది. డేటా ప్రకారం కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ 107,296.64 వద్ద ప్రారంభమై 5000 పాయింట్లు పడిపోయింది. ప్రస్తుతం 2300 పాయింట్లకు పైగా తగ్గి 111,247.06 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 31 పైసలు తగ్గి 84.66కి చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ కు 0.68 శాతం పెరిగి 62.57 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్ ధరలు, ప్రభుత్వ పన్నులు అలాగే రూపాయి విలువలో హెచ్చుతగ్గులు వంటి చాల కారణాల వల్ల భారతదేశంలో బంగారం ధర మారుతూ ఉంటుంది. బంగారం కేవలం పెట్టుబడిగా మాత్రమే కాకుండా మన సంప్రదాయాలు, పండుగలలో కూడా ఒక ముఖ్యమైన భాగం. ముఖ్యంగా పెళ్లిళ్ల, పండుగల సమయంలో పసిడి కొనుగోళ్ల డిమాండ్ పెరుగుతుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications