రియల్ ఎస్టేట్ రంగం అంటేనే లాభాల పుట్ట. అందుకే చాలామంది అందులో పెట్టుబడి పెడుతుంటారు. లాభాలను ఆర్జిస్తుంటారు. అయితే రియాల్టీలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా మార్కెట్ పరిస్థితులను బాగా అవగాహన చేసుకోవాలి. అయితే చాలామంది ఇంటిని అమ్మడమా లేక అద్దెకు ఇవ్వడమా అనే సందేహంలో కూడా ఉంటారు. ఇంటిని కొనుగోలు చేసిన తరువాత దాన్ని లాభానికి అమ్మాలా..లేదా రెంటుతో వచ్చే ఆదాయంతో సరిపెట్టుకోవాలా అనే విషయం తెలియక చాలామంది సతమతమవుతూ ఉంటారు.
ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే.. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో 2BHK ఫ్లాట్‌కి యజమాని అయిన ఆదిత్య (వయస్సు 36) ప్రస్తుతం ముంబైలో ఐటీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. తన పూర్తిగా చెల్లించిన ఫ్లాట్‌ను రూ. 85 లక్షలకు అమ్మాలా, లేక నెలకు రూ. 22,000కి అద్దెకు ఇవ్వాలా అన్న డైలమాలో పడి ఉన్నాడు. అద్దె ద్వారా నెలకు అతనికి స్థిర ఆదాయం వస్తుంది, కానీ అద్దె దారుల తో ఇబ్బందులు, మెయింటెనెన్స్ సమస్యలు ఉండొచ్చు. మరోవైపు, అమ్మితే ఒక రకంగా మొతం వస్తుంది. దీనిని ముంబైలో రియాల్టీ ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టవచ్చు.మరి ఏది ఉత్తమమో తేల్చుకోలేకపోతున్నాడు.

దీన్ని మనం లెక్కలేసి చూస్తే.. ఈ ఫ్లాట్ నెలకు రూ. 22,000 అద్దె ఇస్తే, వార్షిక ఆదాయం రూ.2.64 లక్షలు అవుతుంది. అంటే సుమారుగా 3.1% అద్దె రాబడి (rental yield) వస్తోంది. ఇది భారతదేశంలోని మెట్రో నగరాల్లో సాధారణ స్థాయిగానే చెప్పుకోవచ్చు. అయితే ఇందులో పన్నులు, మెయింటెనెన్స్ ఖర్చులు చూసుకుంటే నికర ఆదాయం మరింత తక్కువవుతుంది.
ఇక ఫ్లాట్‌ను రూ. 85 లక్షలకు అమ్మితే.. 8 సంవత్సరాల క్రితం రూ. 55 లక్షలకు కొన్నట్లు అనుకుందాం. ఇండెక్స్ కలిగి చూసుకుంటే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సుమారుగా రూ. 9.7 లక్షలు అవుతాయి. దీనిపై 20% టాక్స్ వేసుకుంటే రూ. 1.94 లక్షల పన్ను చెల్లించాలి. చివరికి చేతికి వచ్చే నికర మొత్తం రూ. 83 లక్షల పైచిలుకుగా చెప్పుకోవచ్చు.
పలు రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో అద్దె ద్వారా స్థిర ఆదాయం పొందే అవకాశం ఉంది. అయితే కొత్త మెట్రోలు, రింగ్ రోడ్లు, ఐటీ పార్కుల వంటివి వస్తున్న ప్రాంతాల్లో అయితే ఈ ఆస్తి విలువ మరింత పెరగవచ్చు. తద్వారా అమ్మే సమయంలో ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదే అద్దెకు ఇస్తే.. ఖాళీ గ్యాప్‌లు (vacancies), రిపేర్ ఖర్చులు (రూ.1 - రూ1.5 లక్షల వరకు) అద్దె ఆదాయాన్ని తగ్గించవచ్చు. రెగ్యులర్ మేనేజ్‌మెంట్ సపోర్ట్ లేకుంటే, దూరంగా ఉండి ఇంటిని నిర్వహించడం కష్టమే.
చివరగా నిపుణులు ఏం చెబుతున్నారంటే.. అద్దె ద్వారా నెలవారీ ఆదాయం కావాలనుకునేవారికి అద్దె మంచిది. కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు, బెస్ట్ రిటర్న్ కోసం ప్రాపర్టీని అమ్మడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications