PM Kisan: అక్టోబర్ 30న పీఎం కిసాన్ 24వ విడత.. అలా చేస్తే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ..!

రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా రైతులకు నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేల అన్నదాత బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 23 విడతలుగా మొత్తం రూ.46 వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 23వ విడత గత జూన్ లో విడుదల చేశారు. 24వ పీఎం కిసాన్ నిధులు అక్టోబర్ 30న అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పీఎం కిసాన్ 24వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ కావాలంటే.. రైతులు కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ నిధులు అందనున్నాయి. ఇప్పటి వరకు కూడా ఇకేవైసీ చేసుకోని రైతులు ఎవరైనా ఉంటే వెంటనే చేసుకోవచ్చు. దీని కోసం పీఎం కిసాన్ వెబ్ సైట్ కు వెళ్లి ఇకేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అయితే మీ ఆధార్ కు ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి. ఒక వేళ చదువు రాని రైతులు ఎవరైనా ఉంటే.. వారు దగ్గరలోని మీ సేవ లేదా సీఎస్సీ సెంటర్ వెళ్లి ఇకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఈ-కేవైసీ ఎంపికను ఎంచుకుని ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

PM Kisan

సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌ (CSC) లేదా అందుబాటులో ఉన్న అధీకృత సేవా కేంద్రాన్ని సందర్శించి బయోమెట్రిక్ ధ్రువీకరణ చేయించుకోవచ్చు. పీఎం కిసాన్ మొబైల్ యాప్, ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్‌లను అధికారికంగా డౌన్‌లోడ్ చేసుకుని, వాటిలోని సూచనల ప్రకారం ఫేసియల్‌ రికగ్నిషన్‌ ధ్రువీకరణ పూర్తి చేయవచ్చు. అలాగే ఫార్మార్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోవాలి. బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం, ఆధార్ ఆధారిత చెల్లింపులకు అవసరమైన బ్యాంకు సీడింగ్ సక్రమంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందారో లేదో సింపుల్ గా తెలుసుకోవచ్చు.

మొదటగా పీఎం కిసాన్ వెబ్ సైట్ కు వెళ్లాలి. నో యూవర్ స్టేటస్ పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, తెరపై కనిపించే ధ్రువీకరణ కోడ్‌ను పూర్తి చేయండి. అవసరమైతే నమోదిత మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో ధ్రువీకరించండి. ఆ తర్వాత మీకు గతంలో వచ్చిన చెల్లింపుల వివరాలు కనిపిస్తాయి. కాగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతు సంఘాల నుంచి పలు డిమాండ్లు ఉన్నాయి. ఈ పథకంలో భాగంగా ఇచ్చే రూ.6 వేలను రూ.9 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+