Investment: ఈ రోజు స్టాక్ మార్కెట్లు నిన్నటి లాభాల బాటను కొనసాగించాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్ ఉదయం 9.57 గంటలకు 751 పాయింట్లు, నిఫ్టీ 230 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 584 పాయింట్లతో ఫుల్ జోష్ మీద కొనసాగుతున్నాయి. ఫెడ్ మీట్, RBI MPC ఫలితాల మధ్య బేర్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకటనలు వెలువడగానే మార్కెట్లను వీరు తీవ్రంగా ప్రభావితం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే స్వల్ప కాలంలో లాభాలను పొందటానికి విశ్లేషకులు సిఫార్సు చేస్తున్న స్టాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ రూ.820-824 మధ్య కొనుగోలు చేయవచ్చు. దీని టార్గెట్ ధర రూ.900 కాగా స్టాప్ లాస్ రూ.780గా నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్ గత రెండు నెలలుగా రూ.780-800 స్థాయిల వద్ద మంచి సపోర్ట్ లెవెల్స్ కలిగి ఉంది. రోజువారీ RSI 40 నుంచి తిరిగి పుంజుకుంది, ఇది కౌంటర్‌కు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

2. సింధు టవర్స్ స్టాక్ కొనుగోలు ధర రూ.203-205గా ఉంది. దీని టార్కెట్ ధర రూ.228 ఉన్నప్పటికీ స్టాప్ లాస్ రూ.190గా నిర్ధారించారు. RSI రోజువారీ స్కేల్‌లో 50 స్థాయిల నుంచి పుంజుకుంటున్నందున రాబోయే సెషన్లలో బౌన్స్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
3. ముత్తూట్ ఫైనాన్స్ స్టాక్ ను రూ.1,030-1,035 మధ్య కొనుగోలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్ టార్గెట్ ధర రూ.1,100గా నిర్ణయించినప్పటికీ స్టాప్ లాస్ రూ.990గా ఉంచుకోవాలన్నారు. ఈ స్టాక్ రోజువారీ స్కేల్‌లో రూ.1,020 వద్ద కీలక సపోర్ట్ జోన్ లో ట్రేడ్ అవుతోంది.
4. పాలీ మెడిక్యూర్ స్టాక్ టార్కెట్ ధర రూ.1,060 అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్, రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా సూచిస్తున్నారు.
5. వండర్లా హాలిడేస్ స్టాక్ టార్గెట్ ధర రూ.450గా నిర్ణయించారు. ఈ క్రమంలో స్టాక్ స్టాప్ లాస్ రూ.360గా నిర్ణయించారు. స్టాక్ రూ.425 ధర దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఎదుర్కోవచ్చని వారు సూచిస్తున్నారు.
6. థర్మాక్స్ స్టాక్ టార్గెట్ ధర రూ.2,825 గా నిర్ణయించినప్పటికీ దీని స్టాప్ లాస్ రూ.2,440గా ఉంది.
7. టాటా పవర్ స్టాక్ తిరిగి మెమెంటంలోకి వచ్చింది. స్టాక్ టార్గెట్ ధర రూ.255-260 మధ్య ఉంటుందని మెహతా ఈక్విటీస్ టెక్నికల్ ట్రేడర్ రవి గంగన్ సూచిస్తున్నారు. దీర్ఘకాల మద్దతు ధర రూ.220 దగ్గర ఉంది. స్టాక్ స్టాప్ లాస్ రూ.225 వద్ద సూచించబడింది.
8. అదానీ ఎంటర్‌ప్రైజెస్ టార్గెట్ ధర రూ.4,000గా అంచనా వేయబడింది. స్టాక్ స్టాప్ లాస్ రూ.3,570గా ఉంది. ఈ అదానీ గ్రూప్ స్టాక్ ఒక నెల పాటు ఎటువంటి ప్రతికూల రెడ్ క్యాండిల్‌ను క్లోజింగ్ లో చూడలేదు.
9. NTPC షేర్ టార్గెట్ ధర రూ.190గా నిర్ణయించటం జరిగింది. దీని స్టాప్ లాస్ రూ.160గా నిర్ణయించారు. NTPC తన కొత్త 52 వారాల గరిష్ఠమైన రూ.176 స్థాయిని చేరుకుంది.
10. సుమిటోమో కెమికల్ ఇండియా షేర్ టార్గెట్ ధర రూ.575గా ప్రభుదాస్ లిల్లాధర్ టెక్నికల్ రీసెర్చ్ వైశాలి పరేఖ్ సూచించారు. దీని స్టాప్ లాస్ రూ.495గా ఉంటుందని ఆయన సూచించారు.
11. డెల్టా కార్పొరేషన్ స్టాక్ టార్గెట్ ధర రూ.247గా నిర్ణయించారు. దీని స్టాప్ లాస్ రూ.212గా ఉంచుకోవాలని ఇన్వెస్టర్లకు సూచించారు. స్టాక్ రాబోయే రోజుల్లో పైకి ఎగబాకటంతో పాటు బ్రేకవుట్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. ఈ వివరాల ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ చేయవద్దు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్న అంశం. ఆర్థిక సలహాదారు సూచనల మేరకు పెట్టుబడులు పెట్టడం ఉత్తమం.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications