BSNL: బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్.. రూ.51 లకే 28 రోజుల వ్యాలిడిటీతో అన్‎లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా..!

బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.51కే 28 రోజుల పాటు అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటాను అందిస్తోంది. కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. కొత్త సిమ్ ఉచితంగా అందించడంతో పాటు నెలవారీ ప్లాన్‌ను కేవలం రూ.51కే అందిస్తోంది. ఈ ఆఫర్ కొత్త బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. రూ.51 ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు పొందవచ్చు. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక ఆఫర్ 2026 నవంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఇతర నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్ఎన్ఎల్‌కు మారాలనుకునే వారికి ఈ ఆఫర్ ఉపయోగకరంగా ఉండనుంది. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నవారికి ఈ ఆఫర్ వర్తించదు. బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ తీసుకున్నా లేదా వేరే నెట్ వర్క్ నుంచి పోర్ట్ అయిన ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ సిమ్ తీసుకున్న మొదటి నెలలో ఈ ఆఫర్ ఉంటుంది. రెండో నెల నుంచి సాధారణ ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా ఆ సంస్థ తన రెండు దీర్ఘకాలిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల సర్వీస్ వ్యాలిడిటీని పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ రూ. 2,799, రూ. 2,449 ప్లాన్‌లు ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తున్నట్లు ప్రకటించింది.

BSNL

ఈ రెండు ప్లాన్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు, మీకు రోజువారీ డేటా, SMS సౌకర్యం కూడా లభిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ఈ రెండు రీఛార్జ్ ప్లాన్‌లలో ఇప్పుడు ఏయే ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. బీఎస్ఎన్ఎల్ రూ. 2,799 ప్రీపెయిడ్ ప్లాన్ మొదట 365 రోజుల సర్వీస్ వ్యాలిడిటీని అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కంపెనీ అదనంగా 30 రోజుల వ్యాలిడిటీని పెంచింది. దీంతో సిమ్ మొత్తం 395 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 3GB హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను ఆఫర్ చేస్తోంది. రోజువారీ డేటా పరిమితిని చేరుకున్న తర్వాత, ఇంటర్నెట్ వేగం 40Kbpsకి తగ్గుతుందని తెలిపింది. అదనపు వ్యాలిడిటీ తర్వాత, ఈ ప్లాన్ సగటు రోజువారీ ఖర్చు దాదాపు రూ.7.09 గా ఉంది.

ఎక్కువ కాలం పాటు రీఛార్జ్ చేయాలనుకునే, ప్రతిరోజూ ఎక్కువ డేటాను ఉపయోగించాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ సరిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ 2026 నవంబర్ 30 వరకు అందుబాటలో ఉంటుంది. ఇదే కాకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.2,449 ప్లాన్ అందిస్తోంది. దీని వ్యాలిడిటీ కూడా కూడా సంస్థ పెంచింది. ఈ 365 రోజుల ప్లాన్ 15 రోజుల అదనంగా పెంచింది. దీంతో మొత్తం సర్వీస్ వ్యాలిడిటీ 380 రోజులు పెరగనుంది. ఈ ప్లాన్ లో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఉన్నాయి. ఈ ప్లాన్ లో బీఎస్ఎన్ఎల్ ఇన్సూరెన్స్ కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ తీసుకుంటే రోజుకు రూ.6.44 ఖర్చు అవుతున్నట్ల లెక్క. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకునే వారు ఈ ప్లాన్ ను ఎంచుకోవచ్చు. అలాగే రూ.లక్ష రూపాయల వరకు ఇన్స్‌రెన్స్‌ను కూడా రానుంది. బీఎస్ఎన్ఎల్ ఇటీవల తన ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోలో రూ.172, రూ. 184, రూ. 190 కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. TRAI మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

బీఎస్ఎన్ఎల్ కాకుండా ఎయిర్ టెల్ కూడా ఇతర నెట్ వర్క్ నుంచి ఎయిర్ టెల్ కు మారితే ఆఫర్ల ప్రకటిస్తోంది. ఒక నెల ఆన్ లిమిటెడ్ కాల్స్, డైలీ 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ల ఆఫర్ ఉంది. అయితే ఇది అధికారికంగా కాదు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+