Multibagger Stock: ఇటీవల మార్కెట్లలో ఒడిదొడుకులు కొనసాగుతున్నప్పటికీ.. మల్టీబ్యాగర్ స్టాక్స్ మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నాయి. పెట్టుబడిదారులకు ఊహించని లాభాలను అందిస్తూ ముందుకు సాగుతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఆథమ్ ఇన్వెస్ట్‌మెంట్ షేర్ల గురించే. గత మూడేళ్లలో మల్టీబ్యాగర్ స్టాక్ ధర 4,475 శాతానికి పైగా రాబడిని అందించింది. సెప్టెంబర్ 4, 2020న కంపెనీ షేర్ ధర కేవలం రూ.10.23గా ఉంది. గడచిన మూడేళ్లలో మల్టీబ్యాగర్ రాబడులను అందించిన కంపెనీ స్టాక్ ధర ప్రస్తుతం రూ.468.05 వద్ద బీఎస్ఈలో ఉంది.

ఎవరైనా ఇన్వెస్టర్ మూడేళ్ల కిందట కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి ఇప్పటి వరకు కొనసాగించినట్లయితే దాని విలువ రూ.45.75 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది ఆగస్టు 8న కంపెనీ షేర్ ధర బీఎస్ఈలో సరికొత్త రికార్డు ధర రూ.580ని తాకింది. అలాగే ఫిబ్రవరి 23, 2023న కంపెనీ స్టాక్ ధర 52 వారాల కనిష్ఠ ధర రూ.154.50ని పడిపోయింది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయంలో కంపెనీ షేర్ ధర రూ.464.05గా ఉంది.
NBFC స్టాక్ ఏడాది కాలంలో 135% పెరిగింది. అలాగే 2023 ప్రారంభం నుంచి 112 శాతం మేర లాభపడింది. ఆరు నెలల కాలాన్ని పరిశీలిస్తే స్టాక్ ధర 114% పెరిగింది. బీఎస్‌ఈలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.7,949.60 కోట్లుగా ఉంది. జూన్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.62.5 కోట్ల అదాయాన్ని నమోదు చేసింది. అలాగే రూ.32.26 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. ఈ కంపెనీ షేర్లు, సెక్యూరిటీల్లో పెట్టుబడి వ్యాపారాన్ని, ఫైనాన్సింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications