Titan Intech: ఈక్విటీ మార్కెట్లలో కొనసాగిన భారీ బుల్ ర్యాలీతో అనేక కంపెనీల షేర్లు పాల్గొన్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది దీర్ఘకాలంలో 3,100 శాతం రాబడిని అందించింది. ఉచితంగా కంపెనీ షేర్లను అందిస్తోంది.
ఐటీ పరిశ్రమకు సంబంధించిన టైటాన్ ఇంటెక్ కంపెనీ తన ఇన్వెస్టర్లకు భారీ బహుమతిని అందిస్తోంది. ఐటీ సేవల రంగంలోని కంపెనీ తన ఇన్వెస్టర్లకు 3:5 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందిస్తోంది. అంటే కంపెనీ అర్హులైన తన పెట్టుబడిదారులకు ప్రతి 5 షేర్లకు 3 షేర్లను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. బోనస్ షేర్ల ఇష్యూకి రికార్డు తేదీ 17 మే 2024గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ముగింపు సమయానికి టైటాన్ ఇంటెక్ షేర్లు దాదాపు 5% పెరుగుదలతో రూ.95.83గా ఉంది. కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధక కూ.113గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.38.60గా ఉంది.

గడచిన 4 ఏళ్లలో టైటాన్ ఇంటెక్ షేర్లు 3193% విపరీతంగా పెరిగాయి. మే 17, 2020న కంపెనీ షేర్ ధర రూ.2.91 వద్ద ఉంది. ప్రస్తుతం మే 10, 2024న స్టాక్ ధర రూ.95.83 వద్ద ఉన్నాయి. రెండేళ్లలో కంపెనీ షేర్ల పనితీరును పరిశీలిస్తే 323 శాతం భారీ పెరిగుదల నమోదైంది. వాస్తవానికి మే 6, 2022న కంపెనీ షేర్లు రూ.22.70 వద్ద ఉండగా.. మే 10, 2024న ఐటీ పరిశ్రమకు సంబంధించిన టైటాన్ ఇంటెక్ షేర్లు రూ.95.80 వద్ద ముగిసింది.
టైటాన్ ఇంటెక్ షేర్లు గత సంవత్సరంలో 76% కంటే ఎక్కువ పెరిగాయి. మే 11, 2023న కంపెనీ షేర్లు రూ.54.29 వద్ద ఉన్నాయి. అదే సమయంలో గత 6 నెలల్లో ఈ స్మాల్‌క్యాప్ కంపెనీ షేర్లు దాదాపు 60% పెరిగాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు రూ.60.01 నుంచి రూ.95కి పెరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు టైటాన్ ఇంటెక్ షేర్లలో 59% విపరీతమైన జంప్ జరిగింది. టైటాన్ ఇంటెక్ షేర్లు గత 9 నెలల్లో 123% పెరిగాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు రూ.43 నుంచి రూ.95.80కి పెరిగాయి.


Click it and Unblock the Notifications