తిరుమల పరకామణి చోరీ CCTV వీడియో ? ఇది నిజమేనా, లేక రాజకీయ కుట్రనా?

తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి (డొనేషన్ బాక్స్) నుంచి 100 కోట్ల రూపాయల పైగా చోరీకి సంబంధించిన తాజా ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో హాట్ టాపిక్ అయ్యాయి. TDP ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల X లో CCTV ఫుటేజ్ ను షేర్ చేశారు. లోకేష్ ఆరోపణ ప్రకారం, ఈ వీడియోలో 100 కోట్ల రూపాయలకు పైగా పరకామణి డొనేషన్ డబ్బు దొంగలించినట్లు కనిపిస్తోంది.

Tirumala Temple Donations Under Scrutiny Nara Lokesh Shares CCTV Footage YCP Alleges Political Conspiracy

మంత్రి నారా లోకేష్ చెప్పినట్టు, ఈ దోపిడీకి మాజీ టీటిడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దొంగతనం చేసారని, కొంత డబ్బుని సీఎం జగన్ నివాసం అయిన తాడేపల్లి ప్యాలెస్‌కి చేరిందని ఆయన ఆరోపించారు. TDP వాదన ప్రకారం ఈ దోపిడీ సమయంలో వైసీపీ నేతలు పవిత్రమైన తిరుమల ఆస్తిని కూడా దొంగలించినట్లు, జగన్ పాలనలో అవినీతి విస్తరించిందని వారు అన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి చోరీ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఆరోపణలకు స్పందిస్తూ, అది కేవలం రాజకీయ కుట్ర అని అభిప్రాయపడ్డారు. అయన చెప్పినట్టు తాను ఎప్పుడూ తప్పు పని చేయలేదని, ఈ ఆరోపణలు పూర్తిగా అబద్ధమని అన్నారు.

భూమన "ధైర్యం ఉంటే సీబీఐతో నేరుగా విచారణ జరపండి, ప్రభుత్వ సీబీఐ లేదా మీడియా ద్వారా ప్రచారం కాదు" అని సవాల్ చేశారు. అలాగే, తిరుమల దేవస్థానాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం మరియు దాని పవిత్రతను దిగజార్చడం సరికాదని కూడా విమర్శించారు. అదనంగా భూమన కరుణాకర్ రెడ్డి, రవికుమార్ అనే వ్యక్తిపై ప్రస్తావన చేస్తూ, అతని ఆస్తులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించినట్టున్నాయని, వాటిపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని వార్తా న్యూస్ వెబ్‌సైట్ రిపోర్ట్ చేసింది.

ఈ రవి కుమార్ ఎవరు?
సి. వి రవికుమార్ తిరుమల తిరుపతి దేవస్థానంలో హుండీ డబ్బు లెక్కించే కేంద్రంలో ఉద్యోగిగా పనిచేశాడు. టిడిపి ఆరోపణల ప్రకారం, గతంలో ఆయన కొన్ని దొంగతనాలకి పాల్పడ్డారని, ముఖ్యంగా హుండీలో ఉండే విదేశీ కరెన్సీ డాలర్లను దొంగలించడానికి ప్రయత్నించగా సీసీటీవీ కెమెరాలో పట్టుబడ్డాయి. ఈ సంఘటన తర్వాత కేసు కోర్టుకు వెళ్లింది కానీ లోక్ అదాలత్‌లో సెటిల్ అయింది.

ప్రస్తుతం రవికుమార్ ఆస్తులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో ఉన్నాయని ప్రస్తావిస్తూ, ఆ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా సంపాదించబడ్డాయో సీబీఐ దర్యాప్తు జరగాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

రాజకీయ దృష్టికోణంలో చూస్తే, టీడీపీ-వైసీపీ మధ్య ఈ విషయం రాజకీయ పోరాటంగా మారింది. పరకామణి చోరీకి సంబంధించిన వీడియోలు, ఆరోపణలు నిజమా కాదా అన్నది ఇంకా క్లియర్‌గా బయటకు రాలేదు. అందుకే ప్రజలు నిజం తెలుసుకోవాలంటే న్యూట్రల్‌గా విచారణ జరగాలి.

తిరుమల వంటి పెద్ద దేవస్థానాల్లో, పుణ్యస్తల రక్షణ మరియు ట్రస్టు వ్యవస్థ చాలా ముఖ్యమైనవి. ఇక్కడ వచ్చే ప్రతి డొనేషన్, పరకామణి డబ్బు కేవలం భక్తుల విశ్వాసంతో వస్తాయి. అందుకే, తిరుమల దేవస్థానంలో డొనేషన్ సేఫ్‌గా ఉండేలా ట్రాన్స్‌పరెన్సీతో నిర్వహించడానికి కొన్ని వ్యవస్థలు అమలు అయ్యాయి. ఉదాహరణకు, ఎక్కువుగా వచ్చిన డొనేషన్‌లు కచ్చితంగా నమోదు చేయడం, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పరిక్షలు చేయడం, అంతర్గత ఆడిట్ ద్వారా దేవస్థానంలో డబ్బు ఎలా వస్తుంది, ఎలా వినియోగం అవుతుంది అన్నదాన్ని రికార్డ్స్ ద్వారా తనిఖీ చేస్తారు.

భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు రాకుండా, అంతర్గత ఆడిట్ వ్యవస్థ మరింత బలంగా ఉండాలి. ప్రతి డొనేషన్ ఆన్‌లైన్ ద్వారా కూడా ట్రాక్ అయ్యేలా, ట్రాన్సాక్షన్ రికార్డులు డిజిటల్‌గా స్టోర్ చేయడం, రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్‌లను అమలు చేయడం అవసరం. ఇలా అయితే, భవిష్యత్తులో ఏ విధమైన మిస్టేక్ లేదా ఆరోపణలు వచ్చినా సూటిగా అంతర్గత ఆడిట్ ద్వారా వ్యవహరించవచ్చు.

ఈ ఆరోపణలు ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చినప్పుడు రాజకీయ దృష్టికోణం మరింత స్పష్టమవుతుంది. నిజానికి, ఈ సమస్యను కేవలం ఒక పార్టీ మరొక పార్టీ సమస్యగా కాకుండా, దేవస్థాన ఆస్తుల రక్షణ, ప్రభుత్వ నిబంధనల అమలు, సామాజిక విశ్వాసం పరంగా కూడా చూడాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+