ఏపీలో ఈ మధ్య తిరుమల లడ్డు కల్తీ వివాదం పెనుదుమారం రేపుతోంది. అథికార పార్టీ కూటమి ప్రభుత్వం..అలాగే వైసీపీ మీద మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీల మధ్య ఈ వివాదం మరింతగా ముదురుతూ భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆహార భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాలనే లక్ష్యంతో తిరుమల ఆలయ పట్టణంలో ఒక కీలక అడుగు పడుతోంది.
రూ.25 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఆహార పరీక్షా ప్రయోగశాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తుది దశకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతుతో ప్రారంభమవుతున్న ఈ హైటెక్ సౌకర్యం, ప్రతి రోజు లక్షలాది మంది భక్తులకు అందించే ప్రసాదం నాణ్యత, స్వచ్ఛత, భద్రత అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా రూపొందించబడింది.

ఈ కొత్త ప్రయోగశాల ప్రధానంగా తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించనుంది. అలాగే ఆలయంలో తయారయ్యే ఇతర ప్రసాదాలపై కూడా కఠిన పరీక్షలు నిర్వహించనుంది. ఈ సౌకర్యం నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, వచ్చే నెలలోనే ఇది పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వై సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు.
ప్రయోగశాలలో జరిగే పరీక్షల ద్వారా భక్తులకు అందించే లడ్డూ, ప్రసాదాలు అత్యుత్తమ నాణ్యతతో ఉండేలా చూసే అవకాశం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ ప్రయోగశాల ఏర్పాటు జరుగుతోంది. Tirumala లోని పునరుద్ధరించిన పాత పిండి మిల్లు భవనంలో ఇది ఏర్పాటు చేయబడింది. దాదాపు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రంలో టీటీడీ ఆరోగ్య శాఖ మరియు రాష్ట్ర ఆరోగ్య శాఖకు చెందిన సుమారు 40 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
ఈ ప్రయోగశాల ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగించనున్నారు. ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్ ముక్కు, ఎలక్ట్రానిక్ నాలుక అనే రెండు కీలక యంత్రాలు ఈ కేంద్రానికి హార్ట్ గా నిలుస్తాయి. వీటి విలువ సుమారు రూ.3.5 కోట్లు. మానవ ఇంద్రియాలకు గుర్తించలేని సూక్ష్మ వాసన, రుచి, ఆకృతి మార్పులను కూడా ఈ పరికరాలు సులభంగా గుర్తించగలవు.
ఎలక్ట్రానిక్ ముక్కు వాసనలో చిన్న మార్పులను గుర్తించి చెడిపోవడం లేదా కల్తీని వెంటనే ఇది కనిపెట్టగలదు. అదే సమయంలో ఎలక్ట్రానిక్ నాలుక రుచి లక్షణాలు, స్వచ్ఛత స్థాయిలను విశ్లేషిస్తుంది. తిరుమల లడ్డూ తయారీలో అత్యంత కీలకమైన నెయ్యి నాణ్యతను పరీక్షించడంలో ఈ సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ రెండు పరికరాలతో పాటు.. ప్రయోగశాలలో ఆధునిక సూక్ష్మజీవ శాస్త్ర పరీక్షా వ్యవస్థలు, తాజాదనం గుర్తించే సెన్సార్లు, పురుగుమందుల అవశేషాలు, లోహ కాలుష్యాన్ని గుర్తించే ప్రత్యేక సాధనాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. నెయ్యి, చక్కెర, బియ్యం, జీడిపప్పు, ఏలకులు, బాదం, జీలకర్ర, ఎండుద్రాక్ష, శనగలు, డ్రై ఫ్రూట్స్, నీరు వంటి 60కి పైగా ముడి పదార్థాలను క్రమం తప్పకుండా పరీక్షించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆహార పరిశ్రమల్లో ఎలక్ట్రానిక్ ముక్కు, నాలుక వ్యవస్థలను ఇప్పటికే విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. పాల ఉత్పత్తులు, తినదగిన నూనెలు, సుగంధ ద్రవ్యాలు, టీ, ప్యాకేజ్డ్ ఫుడ్ వంటి వాటి నాణ్యతను నిర్ధారించడంలో ఇవి ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. ఔషధ మరియు పర్యావరణ పరిశోధనలలో కూడా ఇలాంటి సాంకేతికతలను వినియోగిస్తున్నారు.
టీటీడీకి గతంలో కల్తీ నెయ్యి సరఫరా జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ హైటెక్ ప్రయోగశాల ఏర్పాటు నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. భవిష్యత్తులో ప్రసాదం తయారీలో ఉపయోగించే ప్రతి పదార్థాన్ని ముందుగానే వేగంగా, ఖచ్చితంగా పరీక్షించడం ద్వారా ఇటువంటి వివాదాలకు పూర్తిగా చెక్ పెట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications