Timken India Stock: గతకొంత కాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగిన బుల్ జోరు అనేక కంపెనీలు మల్టీబ్యాగర్లుగా మార్చేసింది. గతంలో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించని చాలా కంపెనీలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. ఇవి తమ రాబడులను పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టిమ్‌కెన్ ఇండియా షేర్ల గురించే. గడచిన ఐదేళ్ల కాలంలో కంపెనీ షేర్లు తమ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్‌లను అందించాయి. మే 17, 2019న కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.546.1 వద్ద ముగిసిన టిమ్‌కెన్ ఇండియా షేర్లు మే 18, 2024న రూ.4,155 వద్ద ముగిశాయి. ఈ కాలంలో పెట్టుబడిదారులు 661 శాతం రాబడిని అందుకున్నారు. బేరింగ్స్ తయారీ వ్యాపారంలో ఉన్న కంపెనీ మార్కెట్ క్యాప్ బీఎస్ఈలో రూ.31,255 కోట్లుగా ఉంది. టెక్నికల్స్ పరిశీలిస్తే.. టిమ్‌కెన్ ఇండియా షేర్లు 5 రోజులు, 20 రోజులు, 50 రోజులు, 100 రోజులు, 200 రోజుల మూవింగ్ యావరేజ్ కంటే ఎక్కువగా ట్రేడవుతున్నాయి.

అలాగే గడచిన రెండేళ్లలో డబ్బులు డబుల్ చేసిన స్టాక్, మూడేళ్ల కాలంలో 226 శాతం రాబడిని అందించింది. Tips2trades అభిజీత్ ప్రకారం "టిమ్‌కెన్ ఇండియా స్టాక్ ధర బుల్లిష్‌గా ఉంది, అయితే డైలీ చార్ట్‌లలో రూ.3770 వద్ద తదుపరి రెసిస్టెన్స్‌తో చాలా ఓవర్‌బాట్ చేయబడింది.
పెట్టుబడిదారులు రూ.3416 మద్దతు కంటే దిగువన ఉన్న లాభాలను బుకింగ్ చేస్తూనే ఉండాలని సూచించారు. పెట్టుబడిదారులు రూ. 2841 వరకు పతనానికి దారితీయవచ్చు. కంపెనీ తన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన తర్వాత కోటక్ ఈక్విటీస్ కంపెనీ షేర్లకు యాడ్ రేటింగ్ అందించింది.
మార్చి 2023 త్రైమాసికంలో రూ.104.5 కోట్లుగా ఉన్న నికర లాభం Q4లో రూ.141.4 కోట్లకు పెరిగింది. మార్చి 2023 త్రైమాసికంలో రూ.809.2 కోట్లుగా ఉన్న ఆదాయం గత త్రైమాసికంలో రూ.908.5 కోట్లకు పెరిగింది. ఇదే క్రమంలో కంపెనీ ఒక్కో షేరుపై రూ.2.50 డివిడెండ్ అందించాలని నిర్ణయించింది.
కంపెనీ వ్యాపారం..
టిమ్‌కెన్ ఇండియా లిమిటెడ్ బేరింగ్‌లు, గేర్లు, గేరింగ్ అండ్ డ్రైవింగ్ మూలకాల తయారీలో నిమగ్నమై ఉంది. కంపెనీ ఆటోమోటివ్ రంగం, రైల్వే పరిశ్రమ కోసం బేరింగ్‌లు, అనుబంధ వస్తువులు సేవల వంటి ఒక ప్రాథమిక విభాగాన్ని కలిగి ఉంది. ఇది యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్‌ల తయారీ, పంపిణీలో ఉంది. కంపెనీ విక్రయాల్లో ప్రధానంగా టేపర్డ్ రోలర్ బేరింగ్‌లు, ఇతర రోలర్ బేరింగ్‌లు ఉన్నాయి. విభిన్న కస్టమర్ బేస్ కోసం మెకానికల్ పవర్ ట్రాన్స్‌మిషన్ ఉత్పత్తులను తయారు చేస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications