LIC IPO: మే 12వ తేదీ వరకు గడువు, లేదంటే మళ్లీ అనుమతి అవసరం
లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీవో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రావాల్సి ఉంది. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదాపడింది. అయితే ఎల్ఐసీ ఐపీవో కోసం ఇప్పటికే సెబి వద్ద ప్రభుత్వం పేపర్స్ దాఖలు చేసింది. దీని ప్రకారం మే 12వ తేదీ లోపు ఎల్ఐసీ ఐపీవో రావాల్సి ఉంది. మే 12వ తేదీ దాటితే కనుక ప్రభుత్వం సెబి వద్ద అనుమతుల కోసం మరోసారి పేపర్స్ దాఖలు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ప్రభుత్వం 31.6 కోట్ల షేర్లు లేదా 5 శాతం ఎల్ఐసీ వాటాను ఐపీవోకు తీసుకు రానుంది. వీటి వ్యాల్యూ రూ.60,000 కోట్లుగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి మార్చి నెలలోనే అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు లోపే ఐపీవోకు తేవాలనుకున్నది ప్రభుత్వం. కానీ రష్యా-ఉక్రెయిన్ కారణంగా మార్కెట్ క్లిష్ట పరిస్థితుల్లో వేచి ఉండాలని నిర్ణయించింది. మార్కెట్ ఒడిదుడుకుల్లో ఐపీవోకు రావడం ఇన్వెస్టర్లకు కూడా లాభదాయకం కాదని ఆలోచించింది.

ఎల్ఐసీ ఐపీవో కోసం డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట్స్‌ను ఫిబ్రవరి 13వ తేదీన సెబి వద్ద ప్రభుత్వం దాఖలు చేసింది. అయితే ప్రస్తుత డ్రాఫ్ట్ ప్రకారం మే 12 వరకు గడువు ఉంది. మరీ ఆలస్యమైతే సెబికి మరో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఎల్ఐసీ ఎంబేడెడ్ వ్యాల్యూని రూ.5 లక్షల కోట్లుగా లెక్కించారు. మే 12వ తేదీ నాటికి ఐపీవోకు రాకపోతే డిసెంబర్ ఫలితాలతో పాటు తాజాపరచిన ఎంబెడెడ్ వ్యాల్యూని పేర్కొంటి మరోసారి డ్రాఫ్ట్ పత్రాలు సమర్పించవలసి ఉంటుంది. ఎల్ఐసీలో 100 శాతం వాటా కలిగిన ప్రభుత్వం 5 శాతం వాటాను విక్రయించనుంది.


Click it and Unblock the Notifications