క్రిప్టోకరెన్సీలకు డిమాండ్ పెరుగుతోంది. తాజాగా ప్రముఖ పబ్లిషింగ్ కంపెనీ టైమ్ మేగజైన్ ఇప్పుడు బిట్‌కాయిన్, ఇతర కొన్ని క్రిప్టోకరెన్సీలను డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ పేమెంట్‌గా అంగీకరిస్తోంది. ప్రముఖ డిజిటల్ కరెన్సీ ఎక్స్చేంజ్ క్రిప్టో డాట్ కామ్‌తో ఒప్పందం చేసుకుంది. ఇందుకు టైమ్ మేగజైన్ కృతజ్ఞలు తెలుపుతూ తన 18 నెలల డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ కోసం వన్ టైమ్ క్రిప్టో చెల్లింపులను అంగీకరిస్తోంది. ఇటీవల క్రిప్టోకరెన్సీలకు డిమాండ్ పెరుగుతోన్న విషయం తెలిసిందే. క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ ఓ సమయంలో 64వేల డాలర్లు క్రాస్ చేసింది. ప్రస్తుతం 55 డాలర్లకు పైన ఉంది.

మున్ముందు ప్రపంచవ్యాప్తంగా
యూజర్లు క్రిప్టో డాట్ ఆర్గ్ కాయిన్(CRO)తో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ ఆపర్ వర్తిస్తుంది. డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ కాస్ట్ 49 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం అమెరికా, కెనడా దేశాల్లో మాత్రమే క్రిప్టోకరెన్సీ సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంది. రానున్న కొద్ది నెలల్లో అంతర్జాతీయంగా ఈ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల గ్రేస్కేల్ సీఈవో మైఖేల్ సొన్నేన్షీన్ ట్వీట్ చేశారు.
అందులో టైమ్ సంస్థ డిజిటల్ కరెన్సీ అసెట్ మేనేజర్ గ్రేస్కేల్ ఇన్వెస్ట్‌మెంట్‌తో చర్చలు జరుపుతోందని తెలిపారు. తద్వారా అన్ని మీడియా సంస్థలు కూడా తమ బ్యాలెన్స్ షీట్‌లో బిట్ కాయిన్ వంటి క్రిప్టో ఉండేలా చేస్తాయన్నారు.

కొత్తటెక్నాలజీ
క్రిప్టో డాట్ కామ్‌తో కలిసి పని చేస్తున్నామని టైమ్ మేగజైన్ ప్రెసిడెంట్ కేత్ గ్రాసీమ్ అన్నారు. ఇది మరింత విస్తరణకు ఉపయోగపడుతుందన్నారు. టైమ్ మేగజైన్ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటోందని చెప్పడానికి ఇదో నిదర్శనమని టైమ్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ భరత్ క్రిష్ అన్నారు.

మరింత పడిపోయిన బిట్ కాయిన్
ఇదిలా ఉండగా, బిట్ కాయన్ వ్యాల్యూ అంతకంతకూ పడిపోతోంది. గత వారం 64వేల డాలర్ల పైకి చేరుకున్న బిట్ కాయిన్ ఇప్పుడు 54వేల డాలర్లకు పడిపోయింది. టర్కీ నిర్ణయం, అమెరికా ప్రభావంతో బిట్ కాయిన్‌తో పాటు ఎథేరియం వంటి క్రిప్టోకరెన్సీలు పడిపోతున్నాయి. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ జేపీ మోర్గాన్ క్రిప్టో బిట్ కాయిన్ నెగిటివ్ ప్రెడిక్షన్ ఇచ్చింది.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications