Zero Brokerage: ట్రేడర్లకు షాకింగ్ న్యూస్.. ఇక జీరో బ్రోకరేజీల కాలం చెల్లిపోయింది.. ఎందుకంటే?
Trading Charges: రానున్న కాలంలో స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ చేయటం పెట్టుబడిదారులకు ఖరీదైనదిగా మారనుంది. ప్రధానంగా ఇంట్రాడే ట్రేడింగ్, భారీగా ఆప్షన్స్ ట్రేడింగ్ నిర్వహించే ట్రేడర్లకు ఇది చేదువార్తగానే చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ఇటీవలి కాలంలో అనేక నియంత్రణ మార్పులు బ్రోకర్ల లాభాలను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో రానున్న కొన్ని వారాల్లో ప్రముఖ బ్రోజరేజ్ సంస్థలు తమ రుసుములను పెంచవచ్చని తెలుస్తోంది. ట్రేడింగ్ సమయంలో అమ్మకాలు, కొనుగోళ్లకు అలాగే ఇంట్రాడే ట్రేడింగ్ పై రుసములు సమీప భవిష్యత్తులో 10-30 శాతం వరకు పెరగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక చిన్న బ్రోకరేజ్ సంస్థలు తమ ఛార్జీల పెంపును అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో ఇప్పటికే జీరో బ్రోకరేజ్ సేవలు అందిస్తున్న కంపెనీలు సైతం రుసుములు వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త బ్రోకరేజీ సంస్థలు సాధారణంగా ట్రేడర్లను ఆకర్షించేందుకు తొలినాళ్లలో ఇలాంటి సేవలను అందిస్తుంటాయని మనందరికీ తెలిసిందే.

అక్టోబరు 1, 2024 నుంచి అమలులోకి రానున్న కొత్త నియంత్రణ మార్పులు బ్రోకర్ల లాభాలను ప్రభావితం చేయనున్నాయి. స్లాబ్-ఆధారిత రుసుము నిర్మాణాన్ని రద్దు చేయడం, డీమ్యాట్ ఖాతాల్లో ప్రాథమిక సేవలకు హోల్డింగ్ పరిమితిని పెంచడం, సెకండరీ మార్కెట్ కోసం UPI-ఆధారిత బ్లాక్ మెకానిజం ప్రతిపాదన వంటివి ఉన్నాయి. ఈ మార్పు కొత్త ఫీజు నిర్మాణం మరింత పారదర్శకంగా ఉండేలా చూస్తుంది. దేశంలోని అతిపెద్ద డిస్కౌంట్ బ్రోకర్లు గ్రోవ్, జెరోధా, అప్‌స్టాక్స్ దాదాపు 50 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ఇవి ఒక్కో ట్రాన్సాక్షన్ పై రూ.20 వరకు రుసుముగా ప్రస్తుతం వసూలు చేస్తున్నాయి. లేదా సదరు ట్రాన్సాక్షన్ విలువలో 0.03- 0.05 శాతం మధ్య వసూలు చేస్తున్నాయి.
కరోనా తర్వాత ఒక్కసారిగా దేశంలోని రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లను తమ పెట్టుబడులకు మార్గంగా ఎంచుకోవటంతో డీమ్యాట్ ఖాతాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021లో డీమ్యాట్ ఖాతాల సంఖ్య 4.97 కోట్ల నుంచి ప్రస్తుతం దేశంలో 16.7 కోట్లకు పెరిగటం దీనిని సూచిస్తోంది. కొత్తగా వస్తున్న నిబంధనలు ఖర్చులను పెంచటంతో పాటు లాభం ప్రభావితం చేయనుందని టారస్ ఫైనాన్షియల్ మార్కెట్స్ సీఈవో ప్రకాశ్ గగ్దానీ అన్నారు.


Click it and Unblock the Notifications