TikTok: ట్రంప్ ఎంట్రీకి ముందే క్లోజ్.. టిక్‌టాక్ నిర్ణయంతో యూజర్లకు షాక్, ఏమైంది?
TikTok Shut Down: నేటి కాలంలో యువతపై సోషల్ మీడియా మాధ్యమాలపై అధికంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో అనేక టెక్ కంపెనీలు ఇప్పటికే తమ యాప్స్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ ముందుగా వచ్చిన టిక్‌టాక్ మాత్రం యూజర్లను నిలబెట్టుకోగలిగిన సంగతి తెలిసిందే. చైనాకు సంబంధించిన ఈ కంపెనీకి చెడ్డ రోజులు ప్రస్తుతం నడుస్తున్నాయి.
తాజాగా కంపెనీ అమెరికాలోని తన వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. శనివారం రాత్రి నుంచి యాప్ ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయి సేవలను నిలిపివేసింది. అమెరికాలో నిషేధం అమలులోకి రాకముందే చైనా కంపెనీ సేవలకు బ్రేక్ వేసింది. దీంతో యాప్ ఉపయోగిస్తున్న దాదాపు 17 కోట్ల మంది అమెరికన్లు ప్రభావితం అయ్యారు. అమెరికా ప్రభుత్వ చట్టాలు నిషేధించిన వేళ తమ సేవలను నిలిపివేస్తున్నట్లు యూజర్లకు కంపెనీ తెలియజేసింది.

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతున్న జో బైడెన్ మద్దతుతో కాంగ్రెస్ విధించిన నిషేధాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఈ చర్య తీసుకోబడింది. టిక్‌టాక్‌కు సంబంధించిన కంటెంట్‌ను అమెరికన్ లేదా అనుబంధ కొనుగోలుదారుకు విక్రయించనంత వరకు హోస్ట్ చేయడం లేదా అందించడం నుండి అమెరికన్ కంపెనీలను నిరోధించడం దీని ఉద్దేశంగా తెలుస్తోంది. అయితే సోమవారం నాటికి టిక్ టాక్ సేవలు తిరిగి అందుబాటులోకి రావొచ్చనే ఊహాగానాలు సైతం కొనసాగుతున్నాయి.
జనవరి 20న అధికారం చేపట్టనున్న అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ 90 రోజుల పాటు నిషేధాన్ని వాయిదా వేయవచ్చని సీఎన్ఎన్ నివేదించింది. యుఎస్‌లో టిక్‌టాక్ భవిష్యత్తుపై కొనసాగుతున్న అనిశ్చితిలో సుప్రీం కోర్టు నిర్ణయం ముఖ్యమైనదిగా మారింది. ట్రంప్ రేపు అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న వేళ సేవల పునరుద్ధరణపై తిరిగి ఆశలు చిగురిస్తున్నాయి. యాప్ స్టోర్ నుంచి యాప్ తొలగింపు, బైట్ డాన్స్ యాజమాన్యంలోని ఇతర యాప్‌లపై ఇలాంటి చర్యలు దాని చైనీస్ సంబంధాలు, డేటా భద్రతా ప్రమాదాలపై చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
టిక్‌టాక్ సీఈవో జు చ్యూ.. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎంపికైన ట్రంప్ తో జరిపిన చర్చలు యాప్ ని అమెరికా సంస్థకు విక్రయించటానికి సానుకూల పరిస్థితులపై సంకేతాలు ఇస్తున్నాయని తెలుస్తోంది. చట్టపరమైన పరిణామాలపై సర్వీస్ ప్రొవైడర్ల భయాలకు ప్రతిస్పందనగా TikTokను ఆఫ్‌లైన్‌లో తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. తాజా పరిణామాలపై అమెరికన్ యూజర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, చిన్న వ్యాపారాలు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications