అదే జరిగితే.. టిక్‌టాక్ మళ్లీ జనాన్ని ఊపేయడం ఖాయం: భారీ స్కెచ్ వేస్తోన్న మేనేజ్‌మెంట్

వాషింగ్టన్: వాస్తవాధీన రేఖ విషయంలో చైనాతో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల మీది నుంచి అన్ ఇన్‌స్టాల్‌కు గురైన టిక్‌టాక్ మళ్లీ ఊపిరి పోసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్‌లో నిషేధానికి గురైన టిక్‌టాక్ యాప్‌పై ప్రస్తుతం అమెరికాలో కత్తి వేలాడుతోంది. ఈ కత్తి ఎప్పుడైనా తెగి దాని పీక మీద పడొచ్చు. అలాంటి పరిస్థితే ఎదురైతే.. టిక్‌టాక్ భారీగా నష్టపోతుంది. భారత్‌లో నిషేధం అనంతరం ఆర్థికంగా ఒడిదుడుకులను చవి చూస్తోన్న టిక్‌టాక్‌పై అమెరికా ప్రభుత్వం కూడా బ్యాన్ చేస్తే.. అంతే సంగతులు.

చైనా యాప్ కావడం వల్లే..

చైనా యాప్ కావడం వల్లే..

అమెరికాలోనూ నిషేధానికి గురి కావడానికి గల ఏకైక కారణం.. టిక్‌టాక్ చైనా సంస్థకు చెందినది కావడమే. తాను రూపొందించిన యాప్‌ల ద్వారా చైనాలోని కమ్యూనిస్టు ప్రభావం వినియోగదారుల డేటాను చోరీ చేస్తోందనే ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి. అందుకే- టిక్‌టాక్ యాజమాన్యం భారీ స్కెచ్ వేస్తోంది. ఈ స్కెచ్ గనక ఫలిస్తే.. టిక్‌టాక్ తాను కోల్పోయిన పూర్వవైభవాన్ని సంతరించుకోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు..భారత్‌లో సహా. చైనా కంపెనీలో తెగదెంపులు చేసుకోవాలని టిక్‌టాక్ యాజమాన్యం భావిస్తోంది. ఈ దిశగా పూర్తిస్థాయి కసరత్తు చేస్తోంది.

మాతృసంస్థతో తెగదెంపులు చేసుకుంటే..

మాతృసంస్థతో తెగదెంపులు చేసుకుంటే..

చైనా కంపెనీలతో తెగదెంపులో చేసుకుంటే ఏ గొడవా ఉండదనేది ఆ సంస్థ యాజమాన్యం భావిస్తోంది. చైనా సంస్థల నుంచి బయటికి వచ్చిన అనంతరం అమెరికన్ కంపెనీలతో చేతులు కలిపే అవకాశం ఉంది. వందశాతం అమెరికన్ కంపెనీగా ఆవిర్భవించడానికి ప్రణాళికలను రూపొందించిందని అంటున్నారు. వందశాతం అమెరికా కంపెనీగా గుర్తింపును తెచ్చుకోగలిగితే.. భారత్‌లోనూ తాము కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

నిషేధాన్ని తప్పించుకోవాలంటే..

నిషేధాన్ని తప్పించుకోవాలంటే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక సలహాదారు ల్యారీ కుడ్లోవ్ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. టిక్‌టాక్ సంస్థ యాజమాన్యం చైనా కంపెనీలతో తెగదెంపులు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. వందశాతం అమెరికన్ కంపెనీగా ఆవిర్భవించడానికి ప్రయత్నాలు చేస్తోందని, దీనికోసం కొన్ని అమెరికన్ సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తన వద్ద సమాచారం ఉన్నట్లు ల్యారీ కుడ్లోవ్ వెల్లడించారు. నిషేధం వేటు నుంచి తప్పించుకోవడానికి వందశాతం అమెరికన్ కంపెనీగా ఆవిర్భవించాలని భావిస్తున్నట్లు ల్యారీ చెప్పారు.

చైనాతో లింకులను తెంచుకుంటే..

చైనాతో లింకులను తెంచుకుంటే..

చైనా కంపెనీలతో ఉన్న అన్ని రకాల సంబంధాలను తెంచుకుని, వందశాతం అమెరికన్ కంపెనీగా ఆవిర్భవించగలిగితే.. భారత్ సైతం దానిపై విధించిన నిషేధాన్ని ఎత్తేయడంపై పునారలోచించవచ్చని ల్యారీ కుడ్లోవ్ పరోక్షంగా స్పష్టం చేశారు. అమెరికాలో టిక్‌టాక్‌ యాప్‌ను బ్యాన్ చేయాలనే డిమాండ్ ఉధృతంగా వినిపిస్తోందని, ఈ దిశగా యూఎస్ కాంగ్రెస్ సభ్యులు సైతం డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బ్యాన్ చేయడంపై వైట్‌హౌస్ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని, ఎంత సమయం పడుతుందనేది తాను చెప్పలేనని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+