సోషల్ వీడియో యాప్ టిక్ టాక్ గురించి తెలియని స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉండరేమో. ఇందులోని చిన్న చిన్న వీడియోలను చూస్తూ ఎంతో మంది ఎంజాయ్ చేస్తుంటారు. కొంతమంది వందలాదిగా వీడియోలు చేస్తూ సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. ఆకట్టుకునే వీడియోల ద్వారా లక్షలాది లైకులు పొందడమే కాకుండా అభిమానులను పెంచుకుంటున్నారు. తక్కువ కాలంలోనే తమ ప్రతిభను చాటుకుంటూ నటించే అవకాశాలు పొందిన వారు కూడా ఉంటున్నారు. అనేక రకాల సంఘటనలు సంఘటనలు టిక్ టాక్ ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీల ప్రచారానికి కూడా ఇది ఎంతగానో దోహద పడుతోంది. అందుకే ఈ యాప్ కు భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది.

150 కోట్ల డౌన్ లోడ్స్
అతి తక్కువ కాలంలోనే ఈ యాప్ ఎక్కువ మంది వినియోగదారుల ఆదరణను సంపాదించుకోగలిగింది. ఇందుకు నిదర్శనమే ఈ యాప్ డౌన్ లోడ్స్. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్ డౌన్ లోడ్స్ 150 కోట్లు దాటాయట. యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లో ఈ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. ఇది మాములు విషయమేమీ కాదు. ఎంతో ఆదరణ ఉంటే గానీ ఈ స్థాయిలో డౌన్ లోడ్స్ జరిగే అవకాశం ఉండదు. ఈ ఏడాది ఫిబ్రవరి లో టిక్ టాక్ డౌన్ లోడ్స్ 100 కోట్లు దాటాయి. మరో 50 కోట్ల డౌన్ లోడ్స్ కు కేవలం తొమ్మిది నెలలే పట్టడం విశేషం.

భారత్ ముందు...
భారత్ లో టిక్ టాక్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. అందుకే డౌన్ లోడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. టిక్ టాక్ ప్రపంచ వ్యాప్త డౌన్ లోడ్స్ లో భారత్ లో జరిగిన డౌన్ లోడ్స్ దాదాపు 31 శాతంగా ఉన్నాయి. అంటే డౌన్ లోడ్స్ 46.68 కోట్లుగా ఉన్నాయన్న మాట. ఈ ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా డౌన్ లోడ్స్ 61.4 కోట్లుగా ఉన్నట్టు మొబైల్ ఇంటెలీజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ చెబుతోంది. గత ఏడాది తో పోల్చితే డౌన్ లోడ్స్ ఆరు శాతం పెరిగాయి.
* ఈ ఏడాదిలో భారత్ మార్కెట్లో టిక్ టాక్ కు మంచి ఆదరణ లభించింది. ఈ సంవత్సరంలో ఇప్పటికే వరకు 27.76 కోట్ల డౌన్ లోడ్స్ జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన డౌన్ లోడ్స్ లో వాటా దాదాపు 45 శాతం ఉండటం విశేషం.

రెండో స్థానంలో చైనా
ఈ ఏడాది టిక్ టాక్ డౌన్ లోడ్స్ విషయంలో భారత్ స్థానంలో చైనా లో డౌన్ లోడ్స్ 4.55 కోట్లు జరిగాయి. మూడో స్థానంలో ఉన్న అమెరికాలో డౌన్ లోడ్స్ 3.76 కోట్లుగా ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో
* నాన్ గేమింగ్ యాప్ అఫ్ ది ఇయర్ లో 61.4 కోట్ల డౌన్ లోడ్స్ తో టిక్ టాక్ మూడో స్థానంలో నిలిచింది. స్థానంలో వాట్సాప్ (70.74 కోట్లు), రెండో స్థానంలో పేస్ బుక్ మెసెంజర్ (63.62 కోట్లు ) నిలిచాయి.
* నాలుగో స్థానంలో పేస్ బుక్ (58.7 కోట్లు ), ఐదో స్థానములో ఇంస్టాగ్రామ్ (37.62 కోట్లు) ఉన్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications