For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టిక్‌టాక్ డౌన్‌లోడ్స్‌: ఈ విషయంలో మనమే నంబర్ వన్!

|

దేశంలో వేగవంతమైన 4జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రావడంతో నెటిజన్లు ఇంటర్నెట్‌లో అదీ ఇదీ అని చూడకుండా తమకు నచ్చినవన్నీ ఎడాపెడా డౌన్‌లోడ్స్ చేసేస్తున్నారు. సోషల్‌ వీడియో యాప్‌ 'టిక్‌టాక్‌' విషయంలోనూ ప్రస్తుతం మనమే టాప్‌లో ఉన్నాం. చైనా, అమెరికాలో కూడా మన తరువాతే.

'టిక్‌టాక్' ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ ప్లే సహా యాప్‌ స్టోర్‌ నుంచి 150 కోట్ల డౌన్‌లోడ్లను చేరుకోగా.. అందులో 46.8 కోట్ల యూనిక్‌ ఇన్‌స్టాల్స్‌తో భారత్‌ నెంబర్‌ వన్‌గా నిలిచింది. మొత్తం డౌన్‌లోడ్స్‌లో 31 శాతం ఒక్క భారత్‌ నుంచే కావడం గమనార్హం. ఈ జాబితాలో భారత్ తరువాత చైనా, ఆ తరువాత స్థానంలో అమెరికా ఉన్నాయి.

 TikTok App Crosses 1.5 Billion Unique Downloads

2019లో టిక్‌టాక్‌ గత ఏడాది కంటే 6 శాతం అధికంగా 61.4 కోట్ల డౌన్‌లోడ్స్‌ సాధించిందని మొబైల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ సెన్సార్‌ టవర్‌ వెల్లడించింది. 2019లో ఇప్పటివరకూ 27.6 కోట్ల మంది భారత నెటిజన్లు 'టిక్‌టాక్‌'ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, గ్లోబల్‌ ఇన్‌స్టాల్స్‌లో ఇది 45 శాతం వరకూ ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది.

ఇక 4.5 కోట్ల డౌన్‌లోడ్స్‌తో చైనా రెండో అత్యధిక డౌన్‌లోడర్‌గా, 3.6 కోట్ల డౌన్‌లోడ్స్‌తో అమెరికా మూడో స్థానంలో నిలిచాయి. వాట్సాప్‌ 70.74 కోట్లతో, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ 63.2 కోట్లతో ఈ ఏడాది అత్యధిక డౌన్‌లోడింగ్‌ యాప్‌లుగా తొలి 2 స్ధానాలను దక్కించుకోగా, అత్యధిక డౌన్‌లోడింగ్‌ నాన్‌ గేమింగ్‌ యాప్‌ విభాగంలో 61 కోట్ల డౌన్‌లోడ్స్‌తో 'టిక్‌టాక్‌' మూడో స్ధానంలో ఉంది.

English summary

టిక్‌టాక్ డౌన్‌లోడ్స్‌: ఈ విషయంలో మనమే నంబర్ వన్! | TikTok App Crosses 1.5 Billion Unique Downloads

Social video app TikTok has reached 1.5 billion downloads worldwide on the App Store as well as Google Play and India leads the chart with 466.8 million or about 31 per cent of all unique installs.
Story first published: Sunday, November 17, 2019, 7:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X