BharatNet: భారత్‌నెట్ ప్రాజెక్ట్ ద్వారా మారుమూల గ్రామాలకు నెట్ సౌకర్యం..
ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ప్రాజెక్ట్ అయిన భారత్‌నెట్( BharatNet) ప్రాజెక్ట్ కు ఇప్పుడు ఉపగ్రహ మద్దతు కూడా రానుంది. రూ.1.4 లక్షల కోట్ల విలువైన ఈ భారీ ప్రాజెక్టుకు కొత్త రూపు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం (మోడీ ప్రభుత్వం) సన్నాహాలు చేసింది. దీని కింద ఉపగ్రహ కనెక్టివిటీ టెక్నాలజీ, ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యుఎ), ఫైబర్ లైన్‌లు మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాలను హై స్పీడ్ ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేయడానికి ఉపయోగించబడతాయి.
ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు కష్టతరమైన, కొండ ప్రాంతాలలో ఉన్న 10 శాతం గ్రామ పంచాయతీలను శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయనున్నారు. ప్రైవేట్ సంస్థలతో పాటు, శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్‌కామ్) కంపెనీలతో చేతులు కలిపేందుకు BSNL కూడా అనుమతి పొందుతుంది. ప్రాజెక్టు మొదటి, రెండో దశలో కొన్ని గ్రామ పంచాయతీలకు ఈ సౌకర్యం కల్పించారు. కానీ, జియో ఉపగ్రహాలు ఇందుకు సరిపోయేవిగా కనిపించలేదు. ఇప్పుడు కొత్త తరహా శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు.

భారత్‌నెట్ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్న BSNL వచ్చే నెలలో దీనికి సంబంధించి టెండర్‌ను ప్రకటించనుంది. దీని ప్రకారం కంపెనీలు ఫైబర్ కేబుల్ వేయడంతో పాటు ఆపరేషన్, నిర్వహణను నిర్వహించాలి. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రయత్నిస్తోంది. శాటిలైట్ కనెక్టివిటీ కోసం తక్కువ ధర ఎంపికలు అన్వేషించబడతాయి. ఈ ప్రాజెక్ట్ 1, 2 దశలలో దేశంలోని 1.64 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ అందించనున్నారు.
అనుసంధానమైన అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలను మెరుగుపరుచనున్నారు. గ్రామీణ పారిశ్రామికవేత్తలను భారత్‌నెట్‌కు అనుసంధానం చేస్తారు. ప్రాజెక్ట్ కింద వారికి ఫైబర్ టు ది హోమ్ (FTTH) కనెక్షన్ తీసుకున్నందుకు రూ. 8900 నుంచి రూ. 12900 వరకు సహాయం అందిస్తుంది. BharatNet ఎంటర్‌ప్రెన్యూర్ మోడల్ కింద, BSNL ఐదేళ్లలో 1.5 కోట్ల ఫైబర్ కనెక్షన్‌లను అందించాలనుకుంటోంది.


Click it and Unblock the Notifications