ఆడ పిల్ల పుట్టిందంటే చాలు.. ఆమె గురించి తల్లిదండ్రులు ఆలోచిస్తూనే ఉంటారు. తమ కూతురి చదువు, పెళ్లి, భవిష్యత్తు గురించి తరచుగా ఆందోళన చెందుతుంటారు. అయితే చిన్న పొదుపులతో కూతురికి బంగారు భవిష్యత్త్ అందించే అవకాశం ఉంది. భారతదేశపు అతిపెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం మీరు మీ కుమార్తె వివాహానికి ఎటువంటి అదనపు భారం లేకుండా భారీ మొత్తాన్ని పొదుపు చేయవచ్చు.
అదే ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ మీకు ఎప్పటికీ డబ్బు కొరత లేకుండా చేస్తుంది. LIC కన్యాదాన్ పాలసీ మీ కుమార్తె వివాహానికి గణనీయమైన నిధిని అందిస్తుంది. ఆర్థిక విషయాల గురించి చింతించకుండా ఆమె ఉజ్వల భవిష్యత్తు కోసం మీ కలలను నెరవేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఈ పాలసీ కింద, మీరు ప్రతిరోజూ సుమారుగా రూ. 121 డిపాజిట్ చేయాలి. ఇది నెలకు రూ. 3,600 అవుతుంది. ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ మెచ్యూరిటీ వ్యవధి 25 సంవత్సరాలుగా ఉంది.

మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మీరు రూ. 27 లక్షల మొత్తాన్ని అందుకుంటారు. అంతే కాదు మీరు మీ ప్రాధాన్యత ప్రకారం పెట్టుబడి మొత్తాన్ని కూడా సర్దుబాటు చేసుకోవచ్చు. ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీని 13 నుంచి 25 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ కాలానికి తీసుకోవచ్చు. పాలసీదారుడి తండ్రి కనీస వయస్సు 30 సంవత్సరాలు, కుమార్తెకు కనీసం ఒక సంవత్సరం వయస్సు ఉండాలి. ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద వస్తుంది, తద్వారా మీరు పన్ను ప్రయోజనాలకు అర్హులు అవుతారు.
మెచ్యూరిటీ వ్యవధికి ముందే పాలసీదారు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో లేదా దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భంలో కుటుంబ సభ్యులు రూ. 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. అలాగే ఆడ పిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా బాగుటుంది. దీని మెచ్యూరిటీ 21 సంవత్సరాలు. మీ పాపకు 15 ఏళ్లు వచ్చే వరకు పొదుపు చేయవచ్చు. ఇది ప్రభుత్వ పథకం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications