Small Cap Mutual Funds: అక్టోబర్‎లో అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు ఇవే..!

అక్టోబర్‌లో స్మాల్-క్యాప్ పథకాలలో బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ అత్యధిక పెట్టుబడులను ఆకర్షించింది. కానీ పనితీరులో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయింది. అక్టోబర్ లో ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్ మంచి సాధారణ పనితీరు కనబర్చింది. ఇది గణనీయంగా తక్కువ పెట్టుబడులను ఆకర్షించినప్పటికీ, ఇటీవలి కాలంలో మెరుగైన రాబడులను అందించింది. బంధన్, నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్‌లు ఒక్కొక్కటి 260కి పైగా స్టాక్‌లను కలిగి ఉండగా, ఇన్వెస్కో కేవలం 74 స్టాక్‌లను మాత్రమే కలిగి ఉంది. దీంతో దాని పోర్ట్‌ఫోలియో గణనీయంగా మరింత కేంద్రీకృతమైంది.

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) ప్రకారం స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు సెప్టెంబర్‌లోని రూ. 9,039 కోట్ల నుంచి అక్టోబర్‌లో 29 శాతం తగ్గి రూ. 6,408 కోట్లకు పడిపోయింది. లార్జ్- మిడ్-క్యాప్ ఫండ్‌లు ఈ విభాగాన్ని అధిగమించి రూ. 8,484 కోట్లను ఆకర్షించాయి. బంధన్ ఫండ్ తర్వాత సమీర్ రాచ్ నిర్వహించే నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ రూ. 722.57 కోట్లతో తర్వాతి స్థానంలో నిలవగా, తాహెర్ బాద్షా నిర్వహించే ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ రూ. 681.71 కోట్లను ఆకర్షించింది. ఈ మూడు కలిసి ఈ కేటగిరీలోని నికర పెట్టుబడుల మొత్తంలో దాదాపు 46 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

Mutual Fund

ఆస్తుల నిర్వహణ (AUM) పరంగా నిప్పన్ ఇండియా రూ. 76,902.83 కోట్లతో ఈ మూడింటిలో అతిపెద్దదిగా నిలిచింది. ఇది బంధన్ ఫండ్ పరిమాణానికి రెండింతలు పైగా ఉంది. అక్టోబర్‌లో ఈ మూడు ఫండ్లూ ప్రతికూల రాబడులను నమోదు చేశాయి. కానీ నిప్పన్ ఇండియా 5.84 శాతం, బంధన్ 6.17 శాతం క్షీణించగా, ఇన్వెస్కో 3.05 శాతంతో అతి తక్కువ నష్టాన్ని చవిచూసింది. ఆరు నెలలు, ఒక సంవత్సరం రాబడి ఆలోచిస్తే ఇన్వెస్కో స్మాల్ క్యాప మంచి రాబడి అందించింది. ఆరు నెలల్లో 8.41 శాతం, సంవత్సరంలో 5.90 శాతం రాబడి అందించింది. బంధన్ ఫండ్ మూడేళ్లలో 19.99 శాతంతో అత్యంత బలమైన రాబడిని నమోదు చేసింది.

ఐదేళ్ల కాలంలో, ఈ మూడు సంస్థలూ సుమారు 16-16.5 శాతం వార్షిక రాబడులను అందించాయి. సెబీ నిబంధనల ప్రకారం స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్లు తమ ఆస్తులలో కనీసం 65 శాతాన్ని స్మాల్-క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాలి. బంధన్‌కు అత్యధికంగా 70.29 శాతం స్మాల్-క్యాప్ ఎక్స్‌పోజర్ ఉండగా, దాని తర్వాత నిప్పన్ ఇండియాకు 67.62 శాతం, ఇన్వెస్కోకు 62.66 శాతం ఉన్నాయి. ఇన్వెస్కోకు అత్యధికంగా 16.86 శాతం మిడ్-క్యాప్ కేటాయింపు ఉండగా, నిప్పన్ ఇండియాకు 13.09 శాతం, బంధన్‌కు 10.01 శాతం ఉన్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+