ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంకు భారీ షాక్! పేటీఎం నుండి మూడు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ రాజీనామా చేశారు. గత రెండేళ్లుగా పేటీఎం నుండి పలువురు సీనియర్ ఉద్యోగులు బయటకు వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఏకంగా ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వెంటవెంటనే రాజీనామా చేయడం గమనార్హం. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) అభిషేక్ అరుణ్, ఆఫ్ లైన్ పేమెంట్స్ సీవోవే రేణు శట్టి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సీవోవో అభిషేక్ గుప్తా రాజీనామాలు సమర్పించినట్లు వార్తలు వచ్చాయి.
అయిదేళ్లకు పైగా పేటీఎంలో సేవలు అందిస్తున్న అభిషేక్ అరుణ్ కంపెనీ నుండి వైదొలుగుతున్నట్లు లింక్డిన్ పోస్ట్ ద్వారా తెలిపారు. అతను గతంలో ఆర్బీఎల్ బ్యాంకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. అభిషేక్ గుప్తా, రేణు శట్టి గత ఏడాది పేటీఎంలో చేరారు. ఇటీవల వీరు కూడా రాజీనామాలు సమర్పించారని తెలుస్తోంది. ఈ రాజీనామాల పైన పేటీఎం నుండి ప్రకటన వెలువడాల్సి ఉంది.

రేణు పేటీఎంలో హ్యూమన్ రిసోర్సెస్ డిపార్టుమెంట్‌లో మేనేజరియల్ రోల్ ద్వారా ఇందులో కెరీర్ ప్రారంభించారు. పేటీఎం పేమెంట్ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కూడా పని చేశారు. ఏడాది క్రితం బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఛార్జ్ తీసుకున్నారు. రేణు రాజీనామా ఆశ్చర్యపరిచిందని అంటున్నారు. మరో ఎగ్జిక్యూటివ్ అభిషేక్ గుప్తా గత ఏడాది ఇందులో చేరారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సీవోవో (లెండింగ్)గా ఉన్నారు. అతను రాజీనామా చేశారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications