Indeed Survey: అమెరికన్ల హాట్ ఫేవరెట్‌గా మన IT కంపెనీలు.. మైక్రోసాఫ్ట్, ఆపిల్‌ను వెనక్కునెట్టి మరీ..
Indeed Survey: ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై జాబ్ సైట్ 'ఇన్ డీడ్' ఓ సర్వే నిర్వహించింది. ఇందులో పలు విభాగలకు సంబంధించి కొంత స్కోర్ కేటాయించింది. వీటిని బట్టి ఉద్యోగులు ఇష్టపడుతున్న టాప్ 20 కంపెనీల లిస్ట్ తయారుచేసింది. ఇందులో ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
అమెరికాలోని పలువురు ఉద్యోగులపై 'వర్కర్ వెల్ బీయింగ్' సర్వేను 'ఇన్ డీడ్' నిర్వహించింది. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను.. తమ తమ కంపెనీలో పనిచేయడం వల్ల ఎంత సంతోషకంగా ఉన్నారో చెప్పాలని కోరింది. వారి అభిప్రాయాలతో టాప్ 20 కంపెనీల లిస్ట్ ను ఇన్ డీడ్ రూపొందించింది. కాగా ఇందులో 3 భారతీయ IT దిగ్గజాలు చోటు దక్కించుకుని రికార్డు సృష్టించాయి.

పలు కంపెనీలకు ర్యాంకింగ్ ఇచ్చేందుకు గాను.. ఇన్ డీడ్ మిలియన్ల మంది ఉద్యోగుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని వివిధ రకాల సమీక్షలు జరిపింది. ముఖ్యంగా ఉద్యోగుల సంతృప్తి, ఒత్తిడి స్థాయి, సంతోషాలను పరిగణలోనికి తీసుకుంది. వీటి ప్రకారం ఇండియా నుంచి TCS, ఇన్ఫోసిస్, విప్రోలు టాప్ 20లో నిలిచినట్లు బ్లూమ్ బెర్గ్ నివేదించింది.
నూటికి 83 స్కోర్ తో 'లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్' ఈ సర్వేలో అగ్రగామిగా నిలిచింది. H&R బ్లాక్ రెండవ, డెల్టా ఎయిర్ లైన్స్ మూడవ స్థానం దక్కించుకున్నాయి. ఇక ఇండియన్ కంపెనీల విషయానికి వస్తే.. భారతీయ టెక్ దిగ్గజం TCS 4, విప్రో 8, ఇన్ఫోసిస్ 9 స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగిన మైక్రోసాఫ్ట్ 15, ఆపిల్ 20వ ర్యాంకుకు పరిమితం కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications