Year Ender 2023: స్టార్టప్‌లకు కలిసిరాని 2023.. వేల సంఖ్యలో కంపెనీలు క్లోజ్..!
Startup News: అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 2023లో డెడ్‌పూల్డ్ స్టార్టప్‌లు లేదా షట్‌డౌన్ అంచుకు నెట్టివేయబడిన కంపెనీల సంఖ్య 34,848కి చేరుకుంది. 2022లో దాదాపు 18,049 స్టార్టప్‌లు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో స్టార్టప్ కంపెనీల సంఖ్య లక్షను దాటేసింది.
ఈ జాబితాలో నిధులు లేని స్టార్టప్ కంపెనీలు ఉన్నప్పటికీ పెద్ద ఇన్వెస్టర్ల నుంచి మిలియన్ డాలర్లు సేకరించిన అనేక కంపెనీలు సైతం తమ కార్యకలాపాలను ముంగిచాలని చూస్తున్నాయి. వాస్తవానికి మారిన నియంత్రణల వల్ల కొన్ని న్యూఏజ్ కంపెనీలు సైతం ఉన్నాయి. 2021 సెప్టెంబరులో జెస్ట్‌మనీ 450 మిలియన్ డాలర్లు కలిగిన కంపెనీ.. 2023లో షట్‌డౌన్ చేయబడింది. బైనౌ పేలేటర్ వ్యాపారంలో ఉన్న కంపెనీని ఫోన్ పే కొనాలని ప్రయత్నించినప్పటికీ ఆ డీల్ కుదరకపోవటతో ఆ వ్యాపారాన్ని ముగించింది. ఆ తర్వాత ZeMo 2.0గా పిలువబడే దాని టర్నరౌండ్ ప్లాన్ టేకాఫ్ కాలేదు.

భారతీయ రిజర్వు బ్యాంక్ కొత్త నిబంధనలు జెస్ట్‌మనీ కార్యకలాపాల ముగింపుకు కారణమయ్యాయి. ఆ తర్వాత దేశంలోని మింగ్ స్టార్టప్‌లు విభిన్న నియంత్రణ సవాలును ఎదుర్కొన్నాయి. CBIC పన్ను అధికారులు సెప్టెంబరులో ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్ అక్టోబర్ 1 నుంచి 28 శాతం జీఎస్టీ విధించటంతో కంపెనీలు కల్లోలానికి లోనయ్యాయి. ఈ క్రమంలో క్విజీ, MPL-మద్దతుగల స్ట్రైకర్ కొన్ని కంపెనీలు మూతపడ్డాయి. అలాగే Fantok వంటి ఇతర సంస్థలు కార్యకలాపాలను నిలిపివేసాయి. కొన్ని కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల సంఖ్యను తొలగించాయి.
క్రిప్టో ఇన్వెస్టింగ్ ప్లాట్‌ఫారమ్ పిల్లో 21 మిలియన్ డాలర్ల ఫండింగ్ పొందినప్పటికీ.. కష్టతరమైన రెగ్యులేటరీ రూల్స్ వల్ల మూతపడింది. అలాగే టైగర్ గ్లోబల్ వంటి పెద్ద సంస్థల నుంచి ఫండింగ్ పొందిన GoMechanic స్టార్టప్ మూతపడుతోంది. వాస్తవానికి ఇది నిధుల మళ్లింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే ఆరోగ్య సంరక్షణ స్టార్టప్ అయిన Mojocare వృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఆదాయాలను ఎక్కువగా చూపుతున్నట్లు కనుగొనబడింది. దీంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును తిరిగి ఇవ్వాలని వ్యవస్థాపకులను డిమాండ్ చేశారు. ప్రస్తుతం భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్దదిగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications