Debt Mutual Funds: డెట్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..!
మీరు కొన్ని సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టడానికి డెట్ ఫండ్ల కోసం చూస్తున్నారా? అయితే మీరు బ్యాంకింగ్ & పీఎస్యూ డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు. ఎందుకంటే ఈ పథకాలు తమ కార్పస్‌లో కనీసం 80 శాతం నిధులను బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఆర్థిక సంస్థల డెట్ పెట్టుబడులలో పెట్టాలనే నిబంధనను కలిగి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ సలహాదారులు బ్యాంకింగ్ & PSU డెట్ పథకాలు కాస్త సురక్షితమైనవని చెబుతారు. ఎందుకంటే ఈ పథకాలు కేవలం బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల బాండ్లు మరియు పేపర్లలో మాత్రమే పెట్టుబడి పెడతాయి. ఈ సంస్థలలో చాలా వరకు ప్రభుత్వ మద్దతు ఉన్నవి కాబట్టి, వీటికి క్రెడిట్ రిస్క్ ఉండదు.
మూడు సంవత్సరాల క్రితం డెట్ మ్యూచువల్ ఫండ్ రంగంలో తలెత్తిన సమస్యల తర్వాత ఈ పథకాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇటీవలే రేటింగ్ తగ్గింపులు, డిఫాల్ట్‌లతో డెట్ మార్కెట్ కుదేలయ్యింది. చాలా మంది సంప్రదాయ పెట్టుబడిదారులు తమ డబ్బు తిరిగి రాదేమోనని భయపడి డెట్ పథకాలలో పెట్టుబడి పెట్టడం మానేశారు. అయితే ఈ పథకాలకు అస్సలు రిస్క్ లేదని దీని అర్థం కాదు. ఉదాహరణకు ఈ పథకాలు ప్రైవేట్ బ్యాంకులు జారీ చేసిన పేపర్లలో కూడా పెట్టుబడి పెడతాయి. వీటికి ప్రభుత్వ మద్దతు లేనందున, కొంత రిస్క్ ఉంటుంది. అయితే, బ్యాంకులు అధిక నియంత్రణకు లోబడి ఉంటాయి కాబట్టి, నష్టభయం చాలా తక్కువ. అలాగే, వడ్డీ రేట్లలో మార్పులు ఈ పథకాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

పెరుగుతున్న లేదా స్థిరంగా ఉన్న వడ్డీ రేట్ల వాతావరణం డెట్ ఫండ్లకు మంచిది కాదు. అయితే ఈ పథకాలు చాలా దీర్ఘకాలిక బాండ్లలో పెట్టుబడి పెట్టవు కాబట్టి, అవి సాపేక్షంగా మెరుగైన స్థితిలో ఉంటాయి. చాలా మంది మనీ మార్కెట్ పండితులు వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ఆర్‌బిఐ ఈ ఏడాది చివరి భాగంలో వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తుందని చెబుతున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతోందని నమ్మకం కుదిరిన తర్వాత ఆర్‌బిఐ రేట్లను తగ్గించడం ప్రారంభించవచ్చు. అయితే అప్పటి వరకు కొంత అస్థిరతకు సిద్ధంగా ఉండాల్సిందే. మీరు మూడేళ్లపాటు పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఈ పథకాలతో ముడిపడి ఉన్న నష్టభయాల గురించి మీకు అవగాహన ఉంటే, మీరు బ్యాంకింగ్ & పిఎస్‌యు పథకాలలో పెట్టుబడి పెట్టొచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
