Silver Price: కుప్పకూలుతున్న వెండి ధరలు.. పెట్టుబడులు ఆపాలా..!
వెండి ధర పెరుగుతుందని చాలా మంది వెండిలో పెట్టుబడి పెట్టారు. కొంత మంది ఫీజికల్ గా వెండి కొనుగోలు చేయగా.. కొంత మంది గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టారు. అయితే ఇందులో చాలా మంది వెండి ధరలు ఎక్కువగా ఉన్నప్పుడే పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు వెండి ధర భారీగా పడిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెండి ధరలు గరిష్ట స్థాయి నుంచి 50 శాతానికి పైగా పడిపోయాయి. రూ.4 లక్షల స్థాయి నుంచి ఇప్పుడు దాదాపు రూ.1,75,000 లకు తగ్గింది. అయితే వెండిలో బంగారం కంటే ఎక్కువ ఒడిదుడుకులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వెండి ధరలు పతనమవుతున్న పరిస్థితిని చూస్తే.. వచ్చే ఏడాది జనవరి నాటికి కిలో వెండి మళ్లీ పాత రోజుల్లా రూ.లక్ష స్థాయికి పడిపోతుందా అన్న చర్చ కొనసాగుతోంది.
వెండి ధరలు తగ్గడానికి అంతర్జాతీయ పరిస్థితులు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారాు. దీంతో అమెరికా డాలర్ విలువ, ప్రభుత్వ బాండ్ల రాబడి పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు వెండిపై పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగాల్లో వెండి వినియోగం తగ్గడం కూడా రేట్ల పతనానికి కారణంగా వివరిస్తున్నారు. మరో పక్క వెండి ధర మరింత పతనమవుతుందన్న భయంతో పెట్టుబడిదారులు పెట్టుబడులు వెనక్కు తీసుకోవడంతో అది కూడా వెండి ధరలపై ఒత్తిడి పెంచుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 120 డాలర్ల నుంచి ఏకంగా 50 డాలర్ల దిగువకు పడిపోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. రూ.4 లక్షల వద్ద ఎగబడి వెండి కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు, సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం రూ.లక్షా 55వేల స్థాయి వద్ద కీలక సపోర్ట్ లభించే అవకాశం ఉంది. ఒకవేళ అంతర్జాతీయంగా డాలర్ మరింత బలపడి, పారిశ్రామిక డిమాండ్ ఇదే విధంగా తగ్గుతూ పోతే పతనం ఆగదని అంచనా వేస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే వచ్చే జనవరి నాటికి కిలో వెండి ధర లక్ష రూపాయల తగ్గినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
అయితే ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సి విషయం ఏమిటంటే.. బంగారం వలే వెండి ధరలు స్థిరంగా ఉండవు. వెండి ధరల్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో కూడా వెండి ధరల్లో ఇలాంటి అస్థిరత కనిపించింది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications