Cheyutha Pensions: ఈ నెలలోనే బ్యాంకు ఖాతాల్లోకి కొత్త పింఛన్ డబ్బులు.. పెన్షన్ స్టేటస్ చెక్ చేసుకోండిలా..!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 4.5 లక్షల పింఛన్లు మంజూరు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి దీపావళి నాడు కొడంగల్ లో పింఛన్ పత్రాల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టారు. మిగతా ప్రాంతాల్లో పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ కొనసాగుతోంది. రెండు, మూడు రోజుల్లో పెన్షన్ మంజూరు పత్రాలు జారీ చేయనున్నారు. ఈ నెల చివరి నాటికి కొత్త పింఛన్ మంజూరైన వారికి డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు స్టేటస్ తెలుసుకోవచ్చు. 5 లక్షలకు పైగా కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 4.5 లక్షల మందికి కొత్తగా పింఛన్ మంజూరు అయింది.
పింఛన్ స్టేటస్ తెలుసుకోవడానికి చేయూత వెబ్ సైట్ కు వెళ్లాలి. అక్కడ పెన్షన్ ఐడీ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెర్చ్ పై క్లిక్ చేస్తే మీ స్టేటస్ తెలిసిపోతుంది. లేదా మీరు మీ గ్రామ కార్యదర్శి లేదా ఎంపీడీఓ వద్ద వెళ్లి కూడా మీ పింఛన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, నేత, గీత కార్మికులకు 4.5 లక్షల మందికి పింఛన్లు ఇవ్వనున్నారు. పింఛన్ల కోసం తెలంగాణ వ్యాప్తంగా 5,98,193 దరఖాస్తులు వచ్చాయి. అర్హుల ఎంపిక కోసం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లారు. వార్డు, గ్రామ సభలు, ఆధార్ సీడింగ్ చేశారు.

వివరాలన్నీ ఆన్ లైన్ లో నమోదు చేశారు. మొత్తం దరఖాస్తుల్లో సగానికిపైగా (55 శాతానికి పైగా) వితంతువుల నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. వితంతువుల నుంచి 3,31,236 దరఖాస్తులు రాగా దివ్యాంగుల నుంచి 1,48,882, ఒంటరి మహిళల నుంచి 62,689, గీత కార్మికుల నుంచి 37,381, చేనేత కార్మికుల నుంచి 18,005 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. వీటిలో నిబంధనల ప్రకారం అర్హత కలిగిన 4.5 లక్షల మందిని తొలి విడత పింఛన్ల కోసం ఎంపిక చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద 40.44 లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు మంజూరైన 4.5 లక్షల కొత్త పింఛన్లను కలిపితే రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య దాదాపుగా 45 లక్షలకు చేరింది.
దీంతో ప్రభుత్వం ఆర్థిక భారం పడినా.. పింఛన్లు అందిస్తున్నామని మంత్రులు చెబుతున్నారు. కొత్తగా మంజూరు చేసిన 4.5 లక్షల పింఛన్లలో దాదాపు 3 లక్షలు వితంతువుల పింఛన్లు, ఒంటరి మహిళలు ఉన్నట్లు తెలిసింది. అలాగే లక్ష మంది దివ్యాంగులకు కొత్తగా పింఛన్ మంజూరు చేశారు. మరో 50 వేల మంది చేనేత, గీత కార్మికులకు కూడా కొత్త పింఛన్లు మంజూరు చేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications