Bank Holidays: ఆగస్ట్‎లో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి..

చాలా మందికి ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు బ్యాంకులకు వెళ్తుంటారు. డిజిటల్ పేమెంట్ చేసినా.. కొన్ని పనుల కోసం తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆగస్ట్ నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా బ్యాంకులకు 14 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఇందులో రెండో, నాల్గో శనివారం, ఐదు ఆదివారాలు ఉన్నాయి. వీటితో పాటు పబ్లిక్ హాలీడేస్ కూడా ఉన్నాయి. మరో ఏడు రోజులు బ్యాంకులకు సెలవు రానుంది. పనిపై బ్యాంకులకు వెళ్లాల్సినవారు.. సెలవులను చూసుకోని వెళ్లాల్సి ఉంటుంది. ఆగస్ట్ 2 తేదీ ఆదివారం సెలవు ఉండనుంది.

ఆగస్ట్ 4న కేర్ పూజ అగర్తలాలో బ్యాంకులు పని చేయవు. ఆగస్టు 8న రెండో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంక్ శాఖలు మూసివేయనున్నారు. గ్యాంగ్‌టక్‌లో టెండోంగ్ లో రుమ్ ఫాట్ పండుగను జరుపుకుంటారు. ఆగస్టు 9న ఆదివారం సెలవు దినం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంక్ శాఖలు మూసివేయన్నారు. ఆగస్టు 13న ఇంఫాల్‌లో పేట్రియాట్స్ డే సందర్భంగా అన్ని బ్యాంకులు సెలవు ఉండనుంది. ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆగస్టు 16న ఆదివారం సెలవు దినం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంక్ శాఖలు మూసివేయనున్నారు.

Bank Holidays

ఆగస్టు 22న నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంక్ శాఖలకు సెలవులు. ఆగస్టు 19న మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి సందర్భంగా అగర్తలలో బ్యాంకులు మూసివేయనున్నారు. ఆగస్టు 23న ఆదివారం సెలవు దినం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంక్ శాఖలకు సెలవు ఉంటుంది. ఆగస్టు 25న మిలాద్-ఉన్-నబీ/మొదటి ఓణం/మిలాద్-ఇ-షరీఫ్ (ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజు) సందర్భంగా కొచ్చి, తిరువనంతపురం, ఏపోలో బ్యాంకులు మూసివేయనున్నారు. ఆగస్టు 26న ఈద్-ఎ-మిలాద్/బరావఫత్/మిలాద్-ఉన్-నబీ (ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజు)/తిరువోణం సందర్భంగా బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురంలో బ్యాంకులు సెలవు ఉండనుంది.

ఆగస్టు 28న రక్షా బంధన్/పాంగ్-లాబ్‌సోల్/ఈద్-ఇ-మిలాద్-ఉన్-నబీ తర్వాతి శుక్రవారం/శ్రీ నారాయణ గురు జయంతి/అయ్యంకాళి జయంతి సందర్భంగా అహ్మదాబాద్, భోపాల్, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, లక్నో, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురంలో బ్యాంకులు మూసివేయనున్నారు. ఆగస్టు 30న ఆదివారం సెలవు దినం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంక్ శాఖలు సెలవు. భౌతిక బ్యాంక్ శాఖలు మూసివేయన్నారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా అత్యవసర బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. జాతీయ సెలవు దినాల్లో కూడా మీరు ఆన్‌లైన్ లేదా మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించడం కొనసాగించవచ్చని బ్యాంకు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+