Small Cap Mutual Funds: స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారా..!
గత రెండేళ్లలో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ల అంతగా రాణించడం లేదు. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 ఇండెక్స్ సెప్టెంబర్ 2024లో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఐదు నెలల్లోనే అది 27 శాతం పడిపోయింది. జూలై 2025 నాటికి దాదాపు తిరిగి కోలుకుంది. ఆ తర్వాత మళ్లీ పతనమైంది. మార్చి 2026 నాటికి జూలైలో నమోదైన గరిష్ట స్థాయి కంటే 20 శాతం తక్కువకు పడిపోయింది. మళ్లీ పుంజుకుని సెప్టెంబర్‌లో కొత్త గరిష్ట స్థాయిని తాకినప్పటికీ ఆ తర్వాత 9 శాతం క్షీణించింది. ఇలా రెండుసార్లు భారీగా పడి, రెండుసార్లు కోలుకున్న తర్వాత ఈ సూచీ ప్రస్తుతం ఏడాది క్రితం ఉన్న స్థాయిలోనే కోలుకుంది.
ఫిబ్రవరి 2024లో స్మాల్-క్యాప్ ఫండ్ల నిర్వహణలో రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఉండగా.. అక్టోబర్ 2026 నాటికి ఆ మొత్తం రూ. 4.4 లక్షల కోట్లకు పెరిగింది. ఈ వృద్ధిలో నాలుగో వంతు కంటే కొంచెం ఎక్కువ మాత్రమే ధరల పెరుగుదల వల్ల వచ్చింది. మిగిలిన రూ. 1.4 లక్షల కోట్లు కొత్తగా వచ్చిన పెట్టుబడులే. మార్కెట్ రెండుసార్లు పడిపోయినప్పటికీ పెట్టుబడిదారులు తాము పెట్టిన పెట్టుబడుల కంటే ఎక్కువ మొత్తాన్ని వెనక్కి తీసుకున్న నెల ఒక్కటి కూడా లేదు. మార్కెట్ పడిపోయిన వెంటనే అత్యధికంగా కొత్త పెట్టుబడులు వచ్చాయి. కచ్చితమైన ప్లానింగ్ పెట్టుబడిదారులు పెట్టుబడి పెడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

గత 10 ఏళ్ల పనితీరును గమనిస్తే.. సాధారణ స్మాల్-క్యాప్ ఫండ్ ఏడాదికి సగటున 15.2 శాతం రాబడిని ఇచ్చింది. ఇదే కాలంలో మిడ్-క్యాప్ ఫండ్లు 14.3 శాతం, ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్లు 11.9 శాతం, లార్జ్-క్యాప్ ఫండ్లు 10.7 శాతం రాబడిని అందించాయి. స్మాల్ క్యాప్ 2020లో భారీగా పతనమైంది. ఆ తర్వాత మరో రెండుసార్లు పడిపోయింది. ఆ తర్వాత స్వల్పంగా రికవరీ అయింది. డిసెంబర్ 2017లో మార్కెట్ విలువ ప్రకారం 251 నుంచి 1,000వ ర్యాంకులో ఉన్న 750 స్మాల్ క్యాప్ కంపెనీలలో కేవలం 34 మాత్రమే అప్పటి నుంచి మిడ్ లేదా లార్జ్ క్యాప్‌లుగా ఎదిగాయి. వాటిలో సగానికి పైగా ఇప్పుడు మైక్రో క్యాప్‌లుగా ఉన్నాయి.
స్మాల్-క్యాప్ పెట్టుబడి అనేది పెరుగుదలను అందుకోవడం కన్నా, పతనాన్ని తట్టుకుని నిలబడే విధంగా ఉండాలి. అందుకే తక్కువ అస్థిరత ఉన్న స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications