2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో ఎన్నో సంస్కరణలు ఉండవచ్చు. ఎందుకంటే చాలా రంగాల్లో రకరకాల మార్పులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే సామాజిక భద్రతా ప్రయోజనాలను పెంచే ఈ చర్యలో అటల్ పెన్షన్ యోజన (APY) కింద కనీస హామీ పెన్షన్ రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఒక నివేదిక పేర్కొంది.
దీనికి సంబంధించి ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. నివేదిక ప్రకారం, ప్రభుత్వం కనీస హామీ మొత్తాన్ని రూ.10,000కు పెంచనుంది. ప్రస్తుతం పింఛను రూ.1000 నుంచి రూ.5000 వరకు ఉంది. కనీస పెన్షన్ మొత్తంలో పెరుగుదల దేశంలోని బలహీన వర్గాలకు మరింత ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇదే ప్రభుత్వ లక్ష్యం కూడా. అయితే ఈ అటల్ పెన్షన్ యోజన ఏంటి ? దీని వల్ల ఎవరికి లాభం?

అటల్ పెన్షన్ యోజన అంటే ఏమిటి?
అటల్ పెన్షన్ యోజన (APY) అనేది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 9 మే 2015న ప్రారంభించిన పథకం. పేదలు, అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్య ఆదాయ భద్రత కల్పించేందుకు ఇది ఒక సామాజిక భద్రతా పథకం. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు మీద, అటల్ పెన్షన్ యోజన ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసి ఎటువంటి ప్రయోజనాలు పొందని వారికి ఆర్ధిక భద్రత కల్పించే లక్ష్యంగా తీసుకొచ్చారు. 60 ఏళ్ళు దాటినా వారు ఈ పథకం పొందడానికి అర్హులు.
పెరుగుతున్న అటల్ పెన్షన్ యోజన
అక్టోబర్ 2024 నాటికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 56 లక్షల కంటే ఎక్కువ మంది కొత్త వారితో సహా 7 కోట్ల కంటే ఎక్కువ మంది ఈ పథకంలో భాగమయ్యారు. అటల్ పెన్షన్ యోజనను ప్రోత్సహించడంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) కీలక పాత్ర పోషిస్తుంది. వీటిలో రాష్ట్ర అలాగే జిల్లా స్థాయిలో ఔట్ రీచ్ కార్యక్రమాలు, అవగాహన-శిక్షణ కార్యక్రమాలు, హిందీ- ఇంగ్లీష్ అండ్ 21 ఇతర ప్రాంతీయ భాషలలో APY ఫ్లైయర్‌ల పబ్లికేషన్స్ వంటి కార్యక్రమాలు ఉన్నాయి.
పెన్షన్ అమౌంట్
రూ.1,000 నుంచి రూ.5,000 వరకు మీకు నెలకు ఎంత పెన్షన్ కావాలో సెలక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, రూ. 1,000 ప్రతినెల పెన్షన్‌ను సెలెక్ట్ చేసుకునే 18 ఏళ్ల వ్యక్తి నెలకు రూ. 42 ధరతో డబ్బును పెట్టుబడి చేయవచ్చు. నెలకు రూ.5,000 పెన్షన్ కావాలనుకునే 40 ఏళ్ల వ్యక్తి నెలకు గరిష్టంగా రూ.1,454 పెట్టుబడి పెట్టాలి. మీరు ముందుగానే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే చిన్న పెట్టుబడితో ఖచ్చితమైన లాభాలను పొందవచ్చు. పెన్షనర్ మరణించిన సందర్భంలో అతని జీవిత భాగస్వామి జీవితాంతం ఈ పెన్షన్ పొందవచ్చు. కానీ పింఛనుదారులు అలాగే వారి జీవిత భాగస్వామి మరణించిన సందర్భంలో మొత్తం అమౌంట్ ఇంకా దానిపై వడ్డీ నామినీకి చెల్లిస్తారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications