RBI News: ఏటా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు భారీ స్థాయిలో సంపాదన అందిస్తోంది. వాస్తవానికి ఈ సొమ్మును రిజర్వు బ్యాంక్ నుంచి డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వం అందుకుంటోంది. వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి అందించటానికి వెనుక ఆదాయ వనరులు ఏంటి? అనే అంశంపై చాలా మందిలో ప్రశ్నలు ఉన్నాయి.
ఈ ఏడాది రిజర్వు బ్యాంక్ ప్రభుత్వానికి రూ.లక్ష కోట్లు ఈ ఏడాది డివిడెండ్ రూపంలో అందించనున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలకు ఇది కీలకమైనది. వాస్తవానికి గడచిన ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.87,416 కోట్లను ఇచ్చింది. ఇది ఆపరేటింగ్ ఖర్చులు, నిబంధనలను లెక్కించిన తర్వాత అంచనా వేసిన డివిడెండ్ RBI బ్యాలెన్స్ షీట్ మిగులుపై ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది అధిక ఆదాయానికి యూఎస్ ఫెడ్ రేట్ల పెంపుతో విదేశీ మారకపు ఆస్తులపై పెరిగిన వడ్డీ ఆదాయం దోహదపడనుంది.

ఈ ఏడాది మే చివరి నాటికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డివిడెండ్ ఆదాయాన్ని ప్రభుత్వానికి చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక ప్రకారం 2023లో భారతదేశ బ్యాంకింగ్ రెగ్యులేటర్ మొత్తం ఆదాయం రూ.2.3 లక్షల కోట్లుగా ఉంది. ఈ సంఖ్య గతేడాది బడ్జెట్‌లో 5 శాతానికి పైగా ఉంది. అయితే ఇంత భారీ స్థాయిలో ఆర్బీఐ ఆదాయం ఎక్కడి నుంచి సంపాదిస్తుందని చాలా మందిలో ఉన్న అనుమానం. కరెన్సీ ముద్రణ, కరెన్సీ ధర నియంత్రణ వంటివి ఉన్నాయి.
ఇక్కడ ఆర్బీఐ ఆదాయానికి మూలం కరెన్సీ ముద్రణ ద్వారా వచ్చే లాభం. ఆ కరెన్సీ విలువ కరెన్సీని ముద్రించడానికి ఆర్బీఐ ఖర్చు చేసే దానికంటే చాలా ఎక్కువ. అంటే ప్రింటింగ్ ఖర్చుకు ఎంత ఎక్కువ విలువ జోడించబడితే అంత లాభం. దీనికి తోడు దేశంలోని వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ రుణాలను అందిస్తుంటుంది వాటిపై వచ్చే వడ్డీ ఆదాయం, ప్రభుత్వ బాండ్ల కొనుగోలు & అమ్మకం ద్వారా కూడా ఆర్బీఐ సంపాదిస్తుంది. అలాగే RBI విదేశీ మారక నిల్వలు ఆదాయాన్ని ఆర్జించే విదేశీ ఆస్తులను కలిగి ఉంటాయి. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్‌లో 70 శాతం విదేశీ కరెన్సీ ఆస్తుల రూపంలో ఉండగా, 20 శాతం ప్రభుత్వ బాండ్ల రూపంలో ఉన్నాయి. ఈ సెక్యూరిటీల నుంచి ఆర్‌బీఐకి వచ్చే వడ్డీ ఆదాయం రూ. 1.5 లక్షల కోట్ల నుంచి రూ. 1.7 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది.


Click it and Unblock the Notifications