Mutual Funds: ఈ ఏడాది అత్యధిక రాబడులు ఇచ్చిన మ్యూచువల్ ఫండ్లు ఇవే..!
2026లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రాబడులు తీవ్రమైన హెచ్చుతగ్గులతో ఉన్నాయి. సెప్టెంబర్ 30 నాటి కేటగిరీ-స్థాయి డేటా ప్రకారం అనేక కేటగిరీలు నష్టాల్లో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం మూడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలు మాత్రమే 10 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించాయి. అంతర్జాతీయ ఈక్విటీ ఫండ్‌లు 21.21% రాబడితో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత ఫార్మా ఫండ్‌లు 13.98%, స్మాల్-క్యాప్ ఫండ్‌లు 10.59% రాబడితో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా లార్జ్-క్యాప్ ఫండ్‌లు 8.17% నష్టపోగా ఇదే కాలంలో టెక్నాలజీ ఫండ్‌లు 20.27% పడిపోయాయి.
భారతదేశంపై దృష్టి సారించిన చాలా ఈక్విటీ కేటగిరీలతో పోలిస్తే, అంతర్జాతీయ ఈక్విటీ కేటగిరీ సాధించిన 21.21% రాబడి ఆశ్చర్యకరంగా ఉంది. నిప్పన్ ఇండియా తైవాన్ ఈక్విటీ ఫండ్ 2026లో ఇప్పటివరకు 96.64% రాబడిని ఇచ్చింది. ఇది కేటగిరీ-స్థాయి రాబడి కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఎడెల్‌వైస్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఆపర్చునిటీస్ ఈక్విటీ ఆఫ్‌షోర్ 33.99% శాతంతో రెండో స్థానంలో ఉంది. హెచ్‌ఎస్‌బిసి గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఫండ్ 30.54% రాబడిని అందించాయి. నిప్పన్ ఇండియా జపాన్ ఈక్విటీ ఫండ్, ఫ్రాంక్లిన్ ఏషియన్ ఈక్విటీ ఫండ్ కూడా ఈ ఏడాది ఇప్పటివరకు 25% కంటే ఎక్కువ రాబడిని అందించాయి.

10 శాతం కంటే ఎక్కువ రాబడి ఇచ్చిన ఫండ్లలో ఫార్మా మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి. ఈ ఫార్మా విభాగం సెప్టెంబర్ 30 నాటికి 13.98 శాతం రాబడిని ఇచ్చింది. ఇక్కడ కూడా అగ్రశ్రేణి ఫండ్‌లు కేటగిరీ సగటు కంటే గణనీయంగా మెరుగైన పనితీరును కనబరిచాయి. కోటక్ హెల్త్‌కేర్ ఫండ్ 29.10% రాబడిని అందించింది. ఇది కేటగిరీ రాబడికి రెట్టింపు కంటే ఎక్కువ. స్మాల్-క్యాప్ ఫండ్‌లు సెప్టెంబర్ నాటికి 10.59% కేటగిరీ రాబడిని నమోదు చేశాయి. తద్వారా రెండంకెల మార్కును దాటిన మూడవ ఈక్విటీ కేటగిరీగా నిలిచాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 30.21% రాబడిని ఇవ్వగా, సామ్కో స్మాల్ క్యాప్ ఫండ్ 25.45 శాతం, ట్రస్ట్ఎమ్ఎఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ 25.26% రాబడిని అందించాయి.
మల్టీ-క్యాప్ ఫండ్లు 1.10 శాతం రాబడి ఇవ్వగా.. మిడ్-క్యాప్ ఫండ్లు 0.56 శాతం రాబడి ఇచ్చాయి. ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్‌లు 2.78% క్షీణించాయి. ఇదే కాలంలో లార్జ్-క్యాప్ ఫండ్లు 8.17% పడిపోయాయి.
కొన్ని ఫండ్‌లు అధిక రాబడిని అందించినంత మాత్రాన, మొత్తం కేటగిరీ కూడా అదే స్థాయి రాబడిని ఇచ్చిందని అర్థం కాదు. అందువల్ల, ఈ సంవత్సరం అధిక రాబడి ఇచ్చిన ఫండ్లు చూసేటప్పుడు కేటగిరీ పనితీరుకు, వ్యక్తిగత ఫండ్ పనితీరుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
