ICICI Bank FD: సీనియర్ సిటిజన్స్‌కు ఈ బ్యాంకు అదిరిపోయే రిటర్న్స్

పదవీ విరమణ సమయంలో ద్రవ్యోల్భణం-సర్దుబాటు చేయబడిన జీవన వ్యయాలను కవర్ చేయడానికి సీనియర్ సిటిజన్స్‌కు తెలివైన పెట్టుబడి వ్యూహాలు అవసరం. సాధారణ పదవీ విరమణ ప్రణాళిక రిటైర్మెంట్ లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్ వైఖరి, స్థిర ఆదాయ హామీ రాబడి, సులభ నిష్క్రమణ, ఉపసంహరణ నియమాలు మొదలైన వాటిని చూసుకోవాలి. పదవీ విరమణ తర్వాత స్థిర ఆదాయ హామీకి, పదవీ విరమణ చేసిన వ్యక్తి తన సాధారణ మొత్తాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంలో ఇన్వెస్ట్ చేయడం అవసరం. వృద్ధులకు సురక్షిత పెట్టుబడుల విషయానికి వస్తే ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదిగా చెబుతారు. ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెట్టుబడి ఎల్లప్పుడు హామీ ఇచ్చే రాబడి. ఇది సురక్షితమైన ఎంపిక కూడా.

గోల్డెన్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేయండి

గోల్డెన్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేయండి

వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ప్రముఖ ప్రయివేటు బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు సీనియర్ సిటిజన్స్ కోసం అద్భుతమైన బెనిఫిట్స్ ప్రకటించింది. ఈ మేరకు ఈ ప్రయివేటు దిగ్గజ బ్యాంకు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా ప్రకటన చేసింది. 'ఈ వరల్డ్ సీనియర్ సిటిజన్ డే సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంకులో మీ గోల్డెన్ ఇయర్స్ కోసం ఇన్వెస్ట్ చేయండి. అదనపు వడ్డీ రేట్లను పొందండి' అని ట్వీట్ చేసింది. కేవలం సీనియర్ సిటిజన్స్ సౌలభ్యం కోసం... వరల్డ్ సీనియర్ సిటిజన్ డే రోజున ఐసీఐసీఐ బ్యాంకు గోల్డెన్ ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయండి, మీ గోల్డెన్ ఇయర్స్‌లో వర్రీ లేకుండా ఉండండి అని పేర్కొంది. గోల్డెన్ ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ ప్రత్యేక స్కీం గురించి ఇక్కడ తెలుసుకుందాం...

అదనపు వడ్డీ రేటు

అదనపు వడ్డీ రేటు

ఐసీఐసీఐ బ్యాంకు 2020 మే 21వ తేదీన సీనియర్ సిటిజన్స్ కోసం ఈ ప్రత్యేక స్కీంను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఐసీఐసీఐ బ్యాంకు గోల్డెన్ ఇయర్ ఎఫ్‌డీ స్కీం సీనియర్ సిటిజన్స్ కోసం 6.30 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అయిదేళ్ల నుండి పదేళ్ల కాలానికి రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ఈ వడ్డీ రేటు వర్తిస్తోంది. సాధారణ ఫిక్స్డ్ డిపాజిటర్ల కంటే సీనియర్ సిటిజన్స్‌కు వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ గోల్డెన్ ఇయర్ ఎఫ్‌డీ స్కీంలో 80 బేసిస్ పాయింట్లు అధికంగా ఉంటుంది. గతంలో ఆఫర్ చేసిన వడ్డీ రేటు కంటే 50 బేసిస్ పాయింట్లు ఇది ఎక్కువ. ఇక్కడ ఐసీఐసీఐ ఈ ప్రత్యేక సీనియర్ సిటిజన్ స్కీంతో ఉన్న ప్రయోజనాలు తెలుసుకుందాం...

టర్మ్ డిపాజిట్స్

టర్మ్ డిపాజిట్స్

65 ఏళ్ళకు పైబడిన సీనియర్ సిటిజన్స్ తమ టర్మ్ డిపాజిట్స్ పైన అదనంగా 0.30 శాతం వడ్డీరేటును పొందుతారు. ప్రస్తుతం ఉన్న సాధారణ వడ్డీ రేట్లతో పోలిస్తే 0.50 శాతం అదనపు వడ్డీ రేటు వర్తిస్తుంది. అయిదేళ్ల 1 రోజు నుండి పదేళ్ల వరకు ఇది వర్తిస్తుంది.

ఈ స్కీంను సీనియర్ సిటిజన్స్ కోసం గత ఏడాది అందుబాటులోకి తీసుకు వచ్చారు. 2021 అక్టోబర్ 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన ఈ స్కీం వర్తిస్తుంది.

సీనియర్ సిటిజన్లు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పైన లోన్ కూడా తీసుకోవచ్చును. ప్రిన్సిపుల్ అమౌంట్ పైన 90 శాతం వరకు రుణం తీసుకోవచ్చు.

గోల్డెన్ ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ పైన సీనియర్ సిటిజన్స్ క్రెడిట్ కార్డు కూడా తీసుకోవచ్చు.

వడ్డీ రేట్లు ఇలా...

వడ్డీ రేట్లు ఇలా...

- మెచ్యూరిటీ పీరియడ్ 7 days to 14 days - సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.00%,

- మెచ్యూరిటీ పీరియడ్ 15 days to 29 days - సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.00%,

- మెచ్యూరిటీ పీరియడ్ 30 days to 45 days - సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.50%,

- మెచ్యూరిటీ పీరియడ్ 46 days to 60 days - సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.50%,

- మెచ్యూరిటీ పీరియడ్ 61 days to 90 days - సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.50%,

- మెచ్యూరిటీ పీరియడ్ 91 days to 120 days - సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.00%,

- మెచ్యూరిటీ పీరియడ్ 121 days to 150 days - సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.00%,

- మెచ్యూరిటీ పీరియడ్ 151 days to 184 days - సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.00%,

- మెచ్యూరిటీ పీరియడ్ 185 days to 210 days - సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.90%,

- మెచ్యూరిటీ పీరియడ్ 211 days to 270 days - సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.90%,

- మెచ్యూరిటీ పీరియడ్ 271 days to 289 days - సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.90%,

- మెచ్యూరిటీ పీరియడ్ 290 days to less than 1 year - సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.90%,

- మెచ్యూరిటీ పీరియడ్ 1 year to 389 days - 5.40%,

- మెచ్యూరిటీ పీరియడ్ 390 days to less than 18 months - 5.40%,

- మెచ్యూరిటీ పీరియడ్ 18 months to 2 years - సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.50%,

- మెచ్యూరిటీ పీరియడ్ 2 years 1 day to 3 years - సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.65%,

- మెచ్యూరిటీ పీరియడ్ 3 years 1 day to 5 years - సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.85%,

- మెచ్యూరిటీ పీరియడ్ 5 years 1 day to 10 years - సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.30%,

- మెచ్యూరిటీ పీరియడ్ (Golden Years FD) 5 Years (80C FD) - Max to Rs 1.50 lac - సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.85%.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+