ఈ వారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. దీంతో పెట్టుబడులదారుల సంపాదన పెరిగింది. ప్రముఖ పెట్టుబడిదారు రేఖా ఘున్ ఝన్ వాలా సంపాదన పెరిగింది. శుక్రవారం ఆమె పెట్టుబడి పెట్టిన మూడు టాటా గ్రూప్ స్టాక్స్ ల్లో టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్ కంపెనీ నుంచి సుమారు రూ. 240 కోట్లు సంపాదించారు.
అక్టోబర్ నుంచి డిసెంబర్ 20223 త్రైమాసికం వరకు టైటాన్ కంపెనీ రేఖా 4,58,95,970 షేర్లను కలిగి ఉన్నారు. శుక్రవారం టైటాన్ కంపెనీ షేర్లు లాభపడ్డాయి. టాటా మోటార్స్ లో రేఖాకు 5,22,56,000 షేర్లు ఉన్నాయి.శుక్రవారం టాటా మోటార్స్ షేర్ల ధర పెరిగింది. ఇటు ఇండియన్ హోటల్స్ లో 3,00,16,965 షేర్లు ఉన్నాయి. శుక్రవారం ఈ షేర్ల కూడా పెరిగాయి. దీంతో మూడు కంపెనీల లాభాలతో రేఖా సంపద ఈ వారం రూ.240 కోట్లు పెరిగింది.

కాగా మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా (ఎం అండ్ ఎం) ఫిబ్రవరి అమ్మకాల డేటా వచ్చింది.టాటా మోటార్స్ దేశీయ అమ్మకాలలో సంవత్సరానికి 6% (YOY) వృద్ధిని సాధించింది. ఫిబ్రవరి 2023 లో 78,006 యూనిట్లను అమ్మింది. ఇది 2022 అదే నెలలో 73,875 తో పోలిస్తే ఎక్కువ.


Click it and Unblock the Notifications