IPO News: రూ.4,000 కోట్ల కోసం వస్తున్న 9 ఐపీవోలు.. ఇన్వెస్టర్స్ బెట్టింగ్ కోసం సిద్ధంకండి..
Upcoming IPOs: ఐపీవోల మార్కెట్లో సెబీ ఎన్ని మార్పులు తీసుకొచ్చినా రద్దీ మాత్రం పెరుగుతూనే ఉందికానీ తగ్గటం లేదు. దీంతో ఈవారం సైతం దలాల్ స్ట్రీట్ లోకి వరుసగా ఐపీవోలు క్యూ కడుతుండగా దానికి తగినట్లుగానే ఇన్వెస్టర్లు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు. ఐపీవోల్లో బెట్టింగ్ వేసి లిస్టింగ్ గెయిన్స్ పొందాలని చాలా మంది భావిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే ఈవారం మూడు మెయిన్ కేటగిరీ ఐపీవోలతో పాటు, 6 ఎస్ఎమ్ఈ ఐపీవోలు లిస్టింగ్ కోసం రావటం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే గ్రేమార్కెట్లో బలమైన ఆసక్తిని కలిగి ఉన్న ఈ ఐపీవోలు మెుత్తం రూ.4,000 కోట్లను ఇన్వెస్టర్ల నుంచి సమీకరించనున్నాయి. సోలార్ టెక్నాలజీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ తాజా ఈక్విటీతో పాటు ఆఫర్-ఫర్-సేల్ కలిపి రూ.2,830.40 కోట్ల మెగా ఐపీవోతో వస్తోంది. ఇదే క్రమంలో ECOS ఇండియా మొబిలిటీ & హాస్పిటాలిటీ, దివంగత బిగ్‌బుల్ భార్య ప్రముఖ పెట్టుబడిదారు రేఖా రాకేష్ జున్‌జున్‌వాలా మద్దతుతో వస్తున్న బాజార్ స్టైల్ రిటైల్ ఐపీవోలు మెయిన్ కేటగిరీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఎస్ఎమ్ఈ కేటగిరీలో ఐపీవోలు..
1. Indian Phosphate IPO: ఐపీవో విలువ రూ.67.36 కోట్లు; ప్రైస్ బ్యాండ్ ధర రూ.94-99గా నిర్ణయించబడింది.
2. Jay Bee Laminations IPO: ఐపీవో విలువ రూ.88.96 కోట్లు; ప్రైస్ బ్యాండ్ ధర రూ.138-146గా నిర్ణయించబడింది.
3. Vdeal System IPO: ఐపీవో విలువ రూ.18.08 కోట్లు; ప్రైస్ బ్యాండ్ ధర రూ.112గా నిర్ణయించబడింది.
4. Paramatrix Technologies IPO: ఐపీవో విలువ రూ.33.84 కోట్లు; ప్రైస్ బ్యాండ్ ధర రూ.110గా నిర్ణయించబడింది.
5. Aeron Composite IPO: ఐపీవో విలువ రూ.56.10 కోట్లు; ప్రైస్ బ్యాండ్ ధర రూ.121-125గా నిర్ణయించబడింది.
6. Archit Nuwood Industries IPO: ఐపీవో విలువ రూ.168.48 కోట్లు; ప్రైస్ బ్యాండ్ ధర రూ.257-270గా నిర్ణయించబడింది.
ఈవారంలో మార్కెట్లో లిస్టింగ్ అవుతున్న ఐపీవోలు..
- Interarch Building Products IPO
- Orient Technologies IPO
- Forcas Studio IPO
- Brace Port Logistics IPO
- Ideal Technoplast Industries IPO
- QVC Exports IPO


Click it and Unblock the Notifications