వ్యాపారం అంటే కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకెళ్లడం. గ్లోబల్ మార్కెట్‌లో వ్యాపారం వేగంగా విస్తరిస్తున్నా, అంతర్జాతీయ చెల్లింపులు ఇంకా క్లిష్టంగానే ఉంటున్నాయి. ఈ సమస్యనే సాల్వ్ చేయాలనే బెంగళూరు-ఆధారిత ఫిన్‌టెక్ స్టార్టప్ రంగంలోకి దిగింది.
ఈ క్లిష్టతను సింపుల్ చేయాలని నిర్ణయించుకున్న శ్రీవత్సన్ శ్రీధర్, బెంగళూరులో Skydo అనే ఫిన్‌టెక్ స్టార్టప్‌ను స్టార్ట్ చేశారు. ఆయన లక్ష్యం? "గ్లోబల్ పేమెంట్స్ కూడా UPI లా ఈజీ అవ్వాలి".

ఐడియా ఎలా వచ్చిందంటే...
శ్రీధర్ చెబుతున్నట్లు, ఇది అంతా ఒక సింపుల్ కోరికతో మొదలైంది ఎంట్రప్రెన్యూర్ అవ్వాలన్న తపన. ఫిన్‌టెక్‌లో ఎక్కడ పెద్ద గ్యాప్ ఉందో వెతికితే, క్రాస్ బోర్డర్ పేమెంట్స్ పెద్ద హర్డిల్‌గా కనిపించాయి. "దేశీయంగా UPI ఎంత ఈజీగా ఉందో, అంతర్జాతీయ చెల్లింపులూ అలానే జరగాలి కదా" అనిపించింది. అలా Skydo పుట్టింది.
UPI లా సింపుల్ - కానీ గ్లోబల్:
ప్రస్తుత పేమెంట్ ప్లాట్‌ఫార్మ్‌ల్లో చాలా లోపాలున్నాయి. చాలా సిస్టమ్స్ ఇప్పటికీ క్రెడిట్ కార్డ్ రైల్స్ పైనే ఆధారపడి ఉంటాయి. ఫీజులు ఎక్కువ, టైం ఎక్కువ. కానీ Skydo మాత్రం డైరెక్ట్ బ్యాంక్-టు-బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌ల మీద దృష్టి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్య బ్యాంకులతో నెట్‌వర్క్ ఉండటంతో పేమెంట్స్ ఫాస్ట్‌గా, తక్కువ ఖర్చుతో పూర్తవుతాయి. రిసీవర్‌కి ఎలాంటి టెన్షన్ ఉండదు పేమెంట్ కేవలం క్లిక్‌తో పూర్తవుతుంది.
Skydoలో పని చేస్తున్నవాళ్లలో ఎక్కువమంది తాజాగా గ్రాడ్యుయేట్ అయిన జెన్ Z యువతరమే అది ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. వీళ్ళు చాలా బోల్డ్‌గా, కొత్తగా ఆలోచిస్తారు. శ్రీవత్సన్ శ్రీధర్ చెప్పినట్లుగా "ఈ జెన్ Z కిడ్స్ పాత ఇండస్ట్రీ భ్రమల్లో ఉండరు, ఫస్ట్ ప్రిన్సిపుల్స్‌తో థింక్ చేస్తారు. అందుకే కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి." అని అన్నారు. అయితే, వీళ్ళ ఫ్రీ-ఫ్లో టైమింగ్స్‌ని క్లయింట్లు, బ్యాంకుల ఫిక్స్‌డ్ టైమింగ్స్‌కి సెట్ చేయడం మాత్రం కొంచెం ఛాలెంజ్ అవుతుందని నవ్వుతూ చెబుతున్నారు.
నియామకాల విషయంలో కూడా ఆయన ఆలోచన చాలా క్లియర్ "మేము టాలెంట్‌కి కంటే డ్రైవ్‌కి ప్రాధాన్యం ఇస్తాం. మార్కులు, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు ఏదైనా సరే, ముందడుగు వేయాలన్న అటిట్యూడ్ ఉంటే చాలు" అని శ్రీధర్ చెప్పారు.
ఫండ్‌రైజింగ్ హైప్ కాదట - రియల్ స్ట్రగుల్
శ్రీధర్ మాటల్లో "మీడియా ఫండ్‌రైజింగ్‌ను గ్లామరస్‌గా చూపిస్తుంది. కానీ రియాలిటీ ఏమిటంటే 99% స్టార్టప్స్ మొదటి ఫండింగ్ రౌండ్ దాటలేవు, విజయవంతమైన కంపెనీలు కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాయి. ఇన్వెస్టర్లు పెద్ద పిక్చర్‌లో ఆలోచిస్తారు, కానీ మేము రోజువారీ ఆపరేషన్స్‌లో డీప్‌గా ఉంటామని ఆయన అన్నారు.
తన దీర్ఘకాలిక దృష్టి మాత్రం చాలా పెద్దది. ఆయన మాటల్లో, "తదుపరి 10 ఏళ్లలో పేమెంట్స్ రంగం పూర్తిగా మారిపోతుంది. ఇన్‌స్టంట్ పేమెంట్స్, క్రిప్టోకరెన్సీలు, స్టేబుల్‌కాయిన్ అన్నీ మెయిన్‌స్ట్రీమ్ అవుతాయి. ఆ భవిష్యత్తుని షేప్ చేసే కంపెనీల్లో Skydo కూడా ఉండాలి" అని ధైర్యంగా చెబుతున్నారు.
ఇప్పటికి ఇండియాలో స్కేల్ అవ్వడం, ఎగుమతులు-దిగుమతుల కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడమే ఫోకస్. "PayPal, Stripe లా ప్రపంచానికి సేవలందించే ఇండియన్ పేమెంట్స్ కంపెనీ అవ్వాలి" అన్నదే ఆయన కల.
తన వ్యక్తిగత ప్రయాణం గురించి మాట్లాడుతూ "నేను చెన్నైలో పెరిగాను. మా నాన్న స్వయం కృషితో వ్యాపారం స్థాపించారు. వ్యాపారం ఒక్క తరం లోపలే కుటుంబ ఆర్థిక స్థితిని మార్చగలదని నేను చూసాను. కొన్నేళ్లు కుటుంబ వ్యాపారంలో పనిచేసిన తర్వాత, నా కెరీర్ రీసెట్ చేయాలని నిర్ణయించుకున్నాను. బెంగళూరుకి వచ్చి స్టార్టప్ ఎకో సిస్టంలో పని చేయడం మొదలుపెట్టాను," అన్నారు. అంటే, గ్లోబల్ పేమెంట్స్ రంగంలో కొత్త చరిత్ర రాయాలని లక్ష్యంగా పెట్టుకుని, స్కైడో టీమ్ బోల్డ్ స్టెప్స్ వేస్తోంది. భవిష్యత్తులో వీళ్ల పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించే అవకాశం ఉందని అనిపిస్తుంది.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications